దేశంలో మళ్ళీ లాక్‌డౌన్? క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

Centre Clarifies on Lockdown Speculations, Urges Citizens Not to Panic Over Fake News

దేశవ్యాప్తంగా మళ్లీ లాక్‌డౌన్ విధించబోతున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమవుతున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. గత కొన్ని రోజులుగా వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి వేదికల్లో వైరల్ అవుతున్న ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలెవరూ వీటిని నమ్మి ఆందోళన చెందవద్దని కేంద్ర సమాచార ప్రసార శాఖ స్పష్టం చేసింది.

ప్రస్తుతం దేశంలో అటువంటి ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని, ఇవన్నీ కొందరు కావాలని సృష్టిస్తున్న తప్పుడు వార్తలని కొట్టిపారేసింది. తాజాగా దీనిపై స్పందించిన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఈ మేరకు స్పష్టతనిచ్చారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి సోషల్ మీడియా వేదికగా వరుస ట్వీట్లతో కేంద్రం అభిప్రాయాన్ని తెలియజేశారు.

ముఖ్యంగా అంతర్జాతీయంగా చమురు సంక్షేమం లేదా ఇతర కారణాల వల్ల రవాణా నిలిచిపోతుందనే నెపంతో లాక్‌డౌన్ విధిస్తారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన తెలిపారు. ప్రజలు అధికారిక సమాచారం కోసం ప్రభుత్వ వెబ్‌సైట్లు లేదా విశ్వసనీయమైన వార్తా సంస్థలను మాత్రమే అనుసరించాలని సూచించారు. తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్లిష్ట సమయంలో పుకార్లకు తావివ్వకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని హర్దీప్ సింగ్ పురీ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here