ఉత్తరప్రదేశ్ లో ప్రియాంక గాంధీని అడ్డుకున్న పోలీసులు

Mango News, Priyanka Gandhi detained by UP Police, Priyanka Gandhi Sonbhadra Visit latest Updates, Priyanka Gandhi taken into preventive custody, Priyanka Gandhi Taken Into Preventive Custody In Uttar Pradesh, Rahul Gandhi Condemns Priyanka Arrest in Uttar Pradesh, Sonbhadra Land Dispute Priyanka Gandhi Detained, UP Police stop Priyanka from visiting violence

ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ సోంభద్ర ప్రాంతంలో రెండు రోజుల క్రితం ఉబ్బా అనే గ్రామంలో జరిగిన భూవివాదంలో చనిపోయిన కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రియాంకగాంధీ ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో జరుగుతున్న హింసాత్మక సంఘటనల నేపథ్యంలో 144 సెక్షన్ అమలులో ఉందని, అందుకనే స్థానిక నారాయణపూర్ పోలీసులు ఆమెను అడ్డుకున్నారని, ప్రియాంకను అరెస్ట్ చేయలేదని ఆ రాష్ట్ర డీజీపీ తెలిపారు. ఈ క్రమంలో మీడీయాతో మాట్లాడిన ప్రియాంక గాంధీ, శాంతియుతంగా కలిసేందుకు వెళ్తున్న మమల్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేసారో అర్ధం కావడం లేదని, ప్రజల కోసం ఎలాంటి పరిస్థితులనైనా ఎదురుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో కలిసి రోడ్డు పక్కనే కూర్చొని నిరసన తెలియజేసారు.

మొదటగా ఈ సంఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి, రోడ్డు మార్గంలో సోంభద్ర వెళుతుండగా ప్రియాంకను పోలీసులు అడ్డుకున్నారు. ఉబ్బా అనే గ్రామంలో రెండువర్గాల మధ్య భూవివాదం కారణంగా జరిగిన కాల్పుల్లో 10 మంది చనిపోగా, 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఆందోళనల నేపథ్యంలో ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే సంబంధిత అధికారులపై విచారణకు ఆదేశించారు, కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకొని జరిగిన ఘటనపై విచారణ జరుపుతున్నారు.

 

 

[subscribe]
[youtube_video videoid=xYW5h51jj8s]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − fourteen =