బీసీసీఐ చీఫ్​ సెలెక్టర్​ చేతన్​ శర్మ కీలక నిర్ణయం.. పదవికి రాజీనామా, బోర్డు ఆమోదం

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు చేతన్ శర్మ తన రాజీనామా లేఖను బీసీసీఐ సెక్రటరీ జై షాకు పంపించగా.. ఆయన వెంటనే దీనిని ఆమోదించారు. చేతన్ శర్మపై ఇటీవల ఒక టీవీ ఛానల్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన అందులో భారత క్రికెట్ కు సంబంధించిన కొన్ని రహస్యాలను వెల్లడించారు. టీమిండియా ఆటగాళ్లు ఫిట్‌నెస్ కోసం కొన్ని నిషేధిత ఉత్ప్రేరకాలు వినియోగిస్తారని, డోపింగ్ టెస్టులో కూడా ఇది బయటపడదని చెప్పారు. అంతేకాకుండా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య కూడా కొన్ని అభిప్రాయం బేధాలు ఉన్నట్లు తెలియజేశారు. ఇంకా స్టింగ్ ఆపరేషన్ సమయంలో విరాట్ కోహ్లీ మరియు జస్‌ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లపై అసహనం వ్యక్తం చేయడం కనిపించింది.

దీంతో భారత క్రికెట్‌లో కలకలం రేగింది. బోర్డు మరియు ఆటగాళ్లు ఆయనపై మండిపడినట్లు సమాచారం. చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్ తర్వాత చీఫ్ సెలెక్టర్‌పై కెప్టెన్ కెప్టెన్ రోహిత్ శర్మ మరియు వన్డే టీమ్ వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సహా సీనియర్ ఆటగాళ్లు కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన రాజీనామా చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని సమాచారం. ఈ పరిణామాల క్రమంలో ఆయన తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఇక ఈ నేపథ్యంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి రెండు టెస్టులు, వన్డే సిరీస్‌ల సెలక్షన్ కమిటీ సమావేశం ఇప్పుడు సందిగ్ధంలో పడింది. కాగా ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌ తర్వాత తొలగించబడిన తర్వాత చేతన్ శర్మ, గత నెలలోనే బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా తిరిగి నియమించారు. అయితే వివాదాస్పద స్టింగ్ ఆపరేషన్ అతని రాజీనామాకు దారితీసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE