బడ్జెట్‌లో నగరాలకు కేంద్రం మహర్దశ పట్టించింది. 2024-25 బడ్జెట్ తొమ్మిది ప్రాధామ్యాల్లో ఒకటిగా నగరాభివృద్ధిని కేంద్రం ప్రకటించింది. దానికి తగినట్టే.. సిటీలో నివసిస్తున్నవారిపై వరాల వర్షం కురిపించింది. ఎక్కువమంది జనాభా నివసించే రద్దీ నగరాలకు రవాణా అనేది చాలా పెద్ద సంకటం. దీంతో అతి పెద్ద పట్టణాలను రవాణాపరంగా పరుగులు పెట్టించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. 30 లక్షలకుపైగా జనాభా కలిగిన పట్టణాలను దీనికోసం కేంద్రం ఎంపిక చేస్తుంది. వాటిలోంచి 14 నగరాలను ఎంపిక చేసుకుని వాటికి రవాణా హంగులు అద్ది..గ్రోత్ హబ్‌లుమగానూ ఈ పట్టణాలను తీర్చిదిద్దుతారు.
టౌన్ ప్లానింగ్ పథకాలను నగర పొలిమేర ప్రాంతాల అభివృద్ధికి సద్వినియోగం చేసుకుంటామని కూడా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అలాగే, అదనంగా మూడుకోట్ల గృహాలను వచ్చే ఐదేళ్లలో ఈ నగరాలలో నిర్మిస్తామని తెలిపింది. దీనికోసం బడ్జెట్‌లో రూ.10 లక్షల కోట్లను కేంద్రం ప్రతిపాదించింది. నగరాల్లో గృహ నిర్మాణం కోసం ప్రజలు వడ్డీ రాయితీపై తీసుకునే లోన్ల రేటు హేతుబద్ధంగా ఉండేలా చూస్తామని కేంద్రం తెలిపింది.
అందరికీ రెంట్ ఇళ్లులు అందుబాటులో సమకూరేలా, వాటిపై వసూలు చేస్తున్న బాడుగను ఖరారు చేస్తామని కేంద్రం బడ్జెట్‌లో తెలిపింది. పారిశ్రామిక కూలీలు తలదాచుకునే డార్మెటరీలను పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిలో మరిన్ని నిర్మిస్తామని కేంద్రం పేర్కొంది. అలాగే, వారాంతాల్లో సిటీజనులు అల్పాహార అవసరాలను తీర్చేలా ..ఒక వంద వీక్లీ స్ట్రీట్ ఫుడ్ హబ్‌లను ఈ ఎంపిక చేసిన 14 నగరాల్లో నెలకొల్పుతామని వెల్లడించింది.
నగరాలకు నీటి సరఫరాతో పాటు పారిశుద్ధ్య నిర్వహణకు బడ్జెట్‌లో నిర్దిష్ట కార్యాచరణను బడ్జెట్ లో ప్రకటించింది కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వాలు, మల్టీపుల్ డెవలప్మెంట్ బ్యాంకుల సాయంతో దీనిపై బృహత్తర ప్రాజెక్టులను చేపడతామని హామీ ఇచ్చింది. బ్యాంకులు కేంద్రంగా వంద పెద్ద పట్టణాల్లో వీటిని నెలకొల్పుతామని తెలిపారు.
బడ్జెట్‌లో నిర్దేశించిన 9 ప్రాధామ్యాల్లో నగరాభివృద్ధి ఒకటి అని కేంద్రం స్పష్టం చేసింది.నగర ప్రజల సొంతింటి కలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని భరోసా ఇచ్చింది. ఈ సమయంలో ఎదురయ్యే అన్ని సవాళ్లను తాము అధిమిస్తామని చెప్పింది. భూసంబంధ సంస్కరణల్లో భాగంగా పట్టణ భూరికార్డులకు జీఐఎస్ మ్యాపింగ్ విధానంలో డిజిటలైజేషన్ చేపడతామని తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అదనంగా 3 కోట్ల గృహాలను రూ.10 లక్షల కోట్ల అంచనాతో నిర్మిస్తామని తెలిపింది. బ్యాంకులకు తలనొప్పిగా మారిన లోన్ల ఎగవేత సమస్యను కంట్రోల్ చేయడానికి… దేశవ్యాప్తంగా కొత్తగా మరికొన్ని ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేస్తామని బడ్జెట్‌లో కేంద్రం ప్రతిపాదించింది.
ఆస్తుల కొనుగోలుపై కొన్ని రాష్ట్రాలు భారీ స్టాంప్ డ్యూటీ వేస్తున్న విషయాన్ని కేంద్రం గుర్తు చేసింది. ఆ డ్యూటీని రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో తాము త్వరలోనే సవరిస్తామని పేర్కొంది. ముఖ్యంగా, మహిళలు కొనుగోలు చేసే ఆస్తులపై అతి తక్కువ స్టాంప్ డ్యూటీ ఉండేలా తాము చర్యలు తీసుకుంటామని తెలిపింది. నగరాభివృద్ధి స్కీమ్‌ల్లో ఈ ప్రతిపాదనకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చింది.మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ‘భూ ఆధార్’ ప్రక్రియకు విశిష్ఠ సంఖ్యను కేటాయించే ప్రతిపాదన కూడా ఉందని కేంద్రం తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE