ప్రధాని మోదీ కృషి చేసినా విజయం సాధించలేకపోయాం.. ఓటమిని అంగీకరిస్తున్నాం – కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై

CM Bommai Says BJP Concedes Defeat in Karnataka Assembly Elections We Could Not Succeed Despite PM Modis Efforts,CM Bommai Says BJP,BJP Concedes Defeat in Karnataka,Karnataka Assembly Elections,Mango News,Mango News Telugu,BJP Could Not Succeed Despite PM Modis Efforts,CM Basavaraj Bommai,Karnataka CM Basavaraj Bommai,CM Basavaraj Bommai Latest News And Updates,BJP Concedes Defeat in Karnataka,BJP Concedes Defeat in Karnataka Assembly

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే గెలుపు ఖాయం కాగా.. ఈసీ అధికారిక ప్రకటన లాంఛనమే కానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీఎం బసవరాజ్‌ బొమ్మై ఓటమిని అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలుపు కోసం తాము శక్తివంచన లేకుండా కృషి చేశామని, అయినా విజయం సాధించడంలో విఫలమయ్యామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పార్టీలోని ముఖ్య నేతలు, కార్యకర్తలు.. ఇలా అందరూ కలిసి సమిష్టిగా కృషిచేసినా సద్వినియోగం చేసుకోలేకపోయామని, విజయానికి అవసరమైన మార్క్‌ సాధించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

బీజేపీ ఓటమిని అంగీకరిస్తుందని, పూర్తి ఫలితాలు వెల్లడైన తర్వాత సమగ్ర విశ్లేషణ చేసుకుంటామని చెప్పారు. అయితే లోపాలను సరిదిద్దుకుని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా ప్రధాని మోదీ 19 బహిరంగ సభలు, ఆరు రోడ్‌షోలు నిర్వహించి బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసినప్పటికీ బీజేపీ ఓటమి పాలవడంతో బీజేపీ నేతలు నిస్పృహలోకి కూరుకుపోయారు. ఇక నేటి దారుణ పరాభవంతో దక్షిణాదిలో బీజేపీ తన ఏకైక కంచుకోటను కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యం 130 దాటడం గమనార్హం. దీంతో కర్ణాటకలో దాదాపు 40 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం వరుసగా రెండో దఫా గెలిచిన దాఖలాలు లేవన్న ప్రచారం మరోసారి నిజమైంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =