
పిల్లిపిల్లీ రొట్టె కోసం గొడవ పడుతుంటే మధ్యలో వచ్చిన కోతి దానిని ఎగరేసుకుపోయిందన్న పిట్టకథ చిన్నప్పుడు మనమంతా వినే ఉంటాముం. అచ్చంగా ఇప్పుడు అలాగే తయారయింది వాస్తవ పరిస్థితి. భారత్, మాల్దీవుల మధ్య రేగిన గొడవ ఇప్పుడు శ్రీలంకకు కలిసివచ్చింది. రెండు దేశాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం మూడో దేశం అయిన శ్రీలంక లాభ పడుతోంది.భారత టూరిస్టులు మాల్దీవులను బహిష్కరించి.. పొరుగున ఉన్న శ్రీలంకకు వెళుతున్నారు.
శ్రీలంక వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య 2022వ సంవత్సరంతో పోలిస్తే 2023 సంవత్సరంలో దాదాపు రెట్టింపు అయింది. 2022లో లక్షా23వేలకు పైగా భారతీయులు శ్రీలంక పర్యటనకు వెళ్లారు. 2023లో ఈ సంఖ్య 3,02,844కు పెరిగింది. అంటే ఒక్క ఏడాదిలోనే శ్రీలంక వెళ్లే భారతీయ టూరిస్టులు రెట్టింపు అయ్యారు.దీంతో ఆర్థికంగా శ్రీలంక లాభపడుతోంది.
ఇక ఈ ఏడాదిలో సుమారు 6 లక్షల మంది పర్యాటకులు తమ దేశానికి వస్తారని శ్రీలంక ప్రభుత్వం అంచనా వేస్తోంది.భారత పర్యాటకులను ఆకర్షించడానికి శ్రీలంక ప్రభుత్వం ప్రత్యేక ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన సిటీల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఇలాగే మరికొన్ని సిటీల్లోనూ ప్రచారం చేసేలా శ్రీలంక టూరిజం శాఖ ప్లాన్ చేస్తోంది.
చివరకు భారత్, మాల్దీవుల మధ్య నెలకొన్న ఉద్రిక్తత..ఆర్థికపరంగా తమకు కలిసి వచ్చిందని శ్రీలంక టూరిజం శాఖా మంత్రి హరీన్ ఫెర్నాండో స్వయంగా ప్రకటించడం హాట్ టాపిక్ అయింది. 2030 నాటికి పర్యాటకరంగంలో ఎక్కువగా ఖర్చు చేసే దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంటుందని తెలిపారు. అందుకే భారతీయులను ఆకట్టుకోవడానికి అన్ని దేశాలు ప్రయత్నిస్తూ ఉంటాయని అన్నారు.
శ్రీలంక టూరిస్ట్ డిపార్ట్‌మెంట్ లెక్కల ప్రకారం.. 2023వ సంవత్సరంలో మొత్తం 14,87,303 మంది పర్యాటకులు శ్రీలంకకు టూర్ కోసం వెళ్లారు. అందులో 3లక్షల2వేల844 మంది భారతీయులే. అయితే 2023, జూలై తర్వాత నుంచి చూసుకుంటే శ్రీలంక వెళ్లే భారతదేశం నుంచి పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే వస్తుంది.
జనవరిలో శ్రీలంకలో సరదాగా ఎంజాయ్ చేయడానికి 13వేల759 మంది వెళ్లగా, ఫిబ్రవరిలో 13వేల 714 మంది, మార్చిలో 18వేల959, ఏప్రిల్‌లో 19వేల 915 మంది వెళ్లారు. అలాగే మేలో 23వేల 16 మంది జూన్‌లో 26వేల 830 మంది, జూలైలో 23వేల461 మంది, ఆగస్టులో 30వేల 593 మంది, సెప్టెంబర్‌లో 30వేల063, నవంబర్‌లో 28వేల 203, డిసెంబర్‌లో ఏకంగా 43వేల973 మంది భారతీయ పర్యాటకులు శ్రీలంక వెళ్లారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY