తప్పుడు వార్తలపై ఇక కాంగ్రెస్ చెక్ పెట్టనుంది. తాజాగా దీనిపై సమావేశం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ లీగల్ టీమ్.. జిల్లాల వారిగా ఈ శాఖను పెద్ద ఎత్తున విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నారు.దీనిలో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ చెత్తను పరిష్కరించడానికి క్విక్ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇది అటువంటి కేసులను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు.. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తుంది.
సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌లు వంటి సమస్యలు ఎదుర్కోవడానికి కాంగ్రెస్ లీగల్ సెల్ భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. దీనిలో ముఖ్యంగా గాంధీ కుటుంబం, కాంగ్రెస్ ఆ పార్టీలోని పెద్ద నేతలపై ఫేక్ న్యూస్ కేసులో పెద్ద ఎత్తున చట్టపరమైన చర్యలకు సన్నాహాలు చేయబోన్నారు.
ముఖ్యంగా మరికొద్ది నెలల్లో మూడు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో.. ఆ మూడు రాష్ట్రాలతో పాటు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో కాంగ్రెస్ టీమ్ ఏర్పడనుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్త సోషల్ మీడియా విధానాన్ని దృష్టిలో ఉంచుకుని పేక్ న్యూసుల దూకుడుగా చర్య తీసుకున్నారు. ఇందులో దేశ వ్యతిరేకమైనవిగా పరిగణించబడే సోషల్ మీడియా పోస్ట్‌లపై చర్య తీసుకోనున్నారు.
సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పెద్ద సమస్యగా మారడంతో దీనిపై దృష్టి సారించినట్లు కాంగ్రెస్ లా డిపార్ట్‌మెంట్ చీఫ్ అభిషేక్ మను సింఘ్వీ చెప్పారు. అందుకే దీన్ని ఎదుర్కోవడానికి క్విక్ రెస్పాన్స్ టీమ్‌ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇటీవల తమ బృందాలు కొన్ని ఫేక్ న్యూస్‌లపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశాయని, ఆ పోస్టులను తొలగించినట్లు ఆయన చెప్పారు. ఈ బృందాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్ము-కశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై పూర్తిస్థాయిలో నిఘా ఉంచుతామని చెప్పారు.
అభిషేక్ సింఘ్వీ అధ్యక్షతన కాంగ్రెస్‌లోని లా, హ్యూమన్ రైట్స్, ఆర్టీఐ విభాగం తాజాగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో సమావేశమై.. నకిలీ వార్తల సమస్యపై దృష్టి సారించడానికి నిర్ణయం తీసుకుంది. సమావేశం తర్వాత మాట్లాడిన సింఘ్వీ తాము చాలా ఉత్సాహంగా ఉన్నామని, తమ సమావేశం చాలా ఉపయోగకరంగా, సమగ్రంగా సాగిందని అన్నారు. ఫేక్ న్యూస్ ప్రబలంగా వైరల్ అవుతున్న సోషల్ మీడియాలో.. డిపార్ట్‌మెంట్ పాత్రపై తాము ప్రత్యేకంగా దృష్టి పెట్టాలనుకుంటున్నామని తెలిపారు.