రష్యాపై ఐక్యరాజ్యసమితిలో తీర్మానం.. మరోసారి ఓటింగ్‌కు దూరంగా భారత్

India Abstains From Voting Against Russia At UN General Assembly Yesterday, India Abstains From Voting Against Russia At UN General Assembly, UN General Assembly, India Abstains From Voting Against Russia, Ukraine-Russia Conflict, Ukraine-Russia Crisis, Russia Ukraine Conflict, Russia Ukraine, Russian Ukraine crisis Live, Russian Ukraine crisis, Russia-Ukraine War Live Updates, Russia Ukraine War, Ukraine conflict, Conflict in Ukraine, Russia Ukraine conflict LIVE updates, Russia Ukraine conflict News, Russia Ukraine conflicts, Russo Ukrainian War, Ukraine Russia Conflict, Ukraine Russia War, Ukraine, Russia, War Crisis, Ukraine News, Ukraine Updates, Ukraine Latest News, Ukraine Live Updates, russia ukraine war news, russia ukraine war status, Russia Ukraine News Live Updates, Ukraine News Updates, War in Ukraine Updates, Russia war Ukraine, ukraine news today, ukraine russia news telugu, Mango News, Mango News Telugu,

భారత్ మరోసారి రష్యాపై తన తటస్థ వైఖరికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యాను తీవ్రంగా మందలిస్తూ, రష్యా బలగాలన్నింటినీ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) ఆమోదించిన తీర్మానంపై భారత్ ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఉక్రెయిన్‌లో రష్యా సైనిక దాడికి సంబంధించి వారం రోజుల వ్యవధిలో భారత్ గైర్హాజరు కావడం ఇది మూడోసారి. కాగా, UN జనరల్ అసెంబ్లీ ఉక్రెయిన్‌పై రష్యా దాడిని విచారిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. అలాగే, ఈ వివాదంలో ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా బెలారస్ దేశం యొక్క ప్రమేయాన్ని కూడా తప్పుపట్టింది.

ఉక్రెయిన్‌పై రష్యా తక్షణమే బలప్రయోగాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ 193 మంది సభ్యుల జనరల్ అసెంబ్లీ బుధవారం ఓటు వేసింది. ఐదు సభ్య దేశాలు ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయగా, 35 మంది గైర్హాజరవడంతో తీర్మానానికి 141 మంది సభ్యులు మద్దతు పలికారు. ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం.. రష్యా తన అణు బలగాలను పెంచడానికి తీసుకున్న నిర్ణయాన్ని ఖండించింది. బెలారస్, ఎట్టి పరిస్థితుల్లో అంతర్జాతీయ నియమాలకు కట్టుబడి ఉండాలని  పిలుపునిచ్చింది. రాజకీయ చర్చలు, మధ్యవర్తిత్వం మరియు ఇతర శాంతియుత మార్గాల ద్వారా రష్యా-ఉక్రెయిన్ మధ్య వివాదాన్ని తక్షణమే శాంతియుతంగా పరిష్కరించాలని తీర్మానం కోరింది.

దీనిపై UNలో భారతదేశ శాశ్వత ప్రతినిధి T.S. తిరుమూర్తి వివరణ ఇచ్చారు. పరిస్థితుల యొక్క తీవ్రతను, జరుగబోయే పరిణామాలను దృష్టిలో ఉంచుకుని భారతదేశం ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది అని తెలిపారు. ఉక్రెయిన్ లో జరుగుతున్న పరిణామాల పట్ల భారతదేశం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఖార్కివ్‌లో ఒక భారతీయ విద్యార్థి చంపబడ్డాడని ఆయన గుర్తు చేశారు. మేము రష్యన్ ఫెడరేషన్ మరియు ఉక్రెయిన్ రెండింటినీ కోరేది ఒక్కటే.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన మా విద్యార్థులతో సహా భారతీయ పౌరులందరినీ సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేస్తున్నాము.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + twenty =