ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో కుంగుబాటు .. పీఎంవో ఉన్నతస్థాయి సమీక్ష, విపత్తు పీడిత ప్రాంతంగా ప్రకటన

Centre Declared Uttarakhand's Joshimath as Disaster-Prone Area After Sinking and Cracks Detected,Centre Declared,Uttarakhand's Joshimath,Disaster-Prone Area,After Sinking and Cracks Detected,Mango News,Mango News Telugu,Dehradun To Joshimath,Joshimath Hotels,Joshimath Shankaracharya,Delhi To Joshimath,Joshimath Temperature,Joshimath To Auli,Joshimath To Badrinath,Joshimath Weather,Joshimath Is Famous For,Uttarakhand Joshimath,Uttarakhand Joshimath News,Uttarakhand Joshimath Weather,Uttarakhand Joshimath Glacier,Auli Joshimath Uttarakhand,Joshimath To Srinagar Uttarakhand Distance,Joshimath Map Uttarakhand,Hotels In Joshimath Uttarakhand,Places Near Joshimath Uttarakhand,Auli Joshimath Uttarakhand Temperature Today

కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌ ప్రాంతాన్ని విపత్తు పీడిత ప్రాంతంగా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పెరుగుతున్న భూమి క్షీణత మరియు నివాస ప్రాంతాల్లో పగుళ్లు గుర్తించినట్లు పీఎంఓ అధికారులు సోమవారం వెల్లడించారు. జల్ శక్తి మంత్రిత్వ శాఖ నుండి ఒక బృందంతో సహా కేంద్ర ప్రభుత్వం నుండి రెండు బృందాలు ఇక్కడికి చేరుకుంటున్నాయని, జోషిమఠ్‌ మరియు సమీప ప్రాంతాలలో నిర్మాణ కార్యకలాపాలు నిషేధించబడ్డాయని వారు తెలిపారు. గత కొన్ని రోజులుగా ఇక్కడ అసాధారణ రీతిలో భూమి కుంగిపోతోంది. ఎందుకంటే భూమి క్షీణత కారణంగా ఇళ్ళు మరియు రోడ్లపై భారీ పగుళ్లు ఏర్పడుతున్నాయి. దాదాపు 600 ఇళ్లు వివిధ స్థాయిలలో ప్రభావితమయ్యాయి. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఇక్కడినుంచి వందలాది మంది ప్రజలను ఖాళీ చేయించారు. ఈ పరిస్థితి నిరసనలకు కూడా దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రభావిత ప్రజలకు డ్రై రేషన్ కిట్లు పంపిణీ చేస్తుండగా.. పునరావాసం కల్పించాలని మరియు పరిసరాల్లో జరుగుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పూర్తిగా నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో జిల్లా యంత్రాంగం బాధిత ప్రజల కోసం సహాయ శిబిరాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తోంది. ఇక ఇక్కడ పరిస్థితిని సమీక్షించడానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శనివారం ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం సీఎం పుష్కర్ సింగ్ ధామికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అవసరమైన సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.

కాగా జోషిమఠ్‌ అనేది ఉత్తరాఖండ్‌లోని ఉత్తర దిక్కున ఉన్నఒక పట్టణం. ఇక్కడ దాదాపు 17,000 మంది జనాభా నివసిస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇక ఇది హిందువులు పవిత్ర క్షేత్రంగా భావించే బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి వెళ్లే యాత్రికులకు ప్రవేశ ద్వారం వంటిది. అలాగే హిమాలయాలలోని కొన్ని ప్రాంతాలను ట్రెక్కింగ్ చేయడానికి వచ్చే పర్యాటకులకు ప్రసిద్ధి చెందింది. అయితే ఇటీవల జోషిమఠ్‌లోని వందలాది ఇళ్లు ఇటీవలి రోజుల్లో భూమి కుంగిపోవడంతో పగుళ్లు ఏర్పడ్డాయి. పొరుగున ఉన్న జాతీయ రహదారులు మరియు సరిహద్దు రహదారులతో సహా – ఇళ్ళు, రోడ్లు మరియు పొలాలలో భారీ పగుళ్లు కనిపించాయి. ఇంకా కొండచరియలు విరిగిపడటంతో భారత్-చైనా సరిహద్దులను కలిపే జోషిమఠ్‌-మలారి సరిహద్దు రహదారిపై పలుచోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. బద్రీనాథ్ జాతీయ రహదారిలో ఎక్కువ భాగం కూడా కొండచరియలు విరిగిపడుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =