ఈసారి దేశ వ్యాప్తంగా అన్ని పార్టీ పార్టీలకు కూడా ఊహించని ఫలితాలనే అందించారు ఓటర్లు. గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన పార్టీలు గల్లంతయ్యాయి. అనుకున్న సీట్లు సాధిస్తామా లేమా అన్న పార్టీలకు అనుకోని విజయాలు అందివచ్చాయి. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో.. కాంగ్రెస్ పార్టీ అంచనాలన్నీ తలకిందులయ్యాయి.
దీంతో ఆశించిన స్థానాల్లో కూడా ఎందుకు గెలవలేకపోయామన్న అంశంపై ఏఐసీసీ ఆరా తీస్తోంది. కొంతమంది నాయకులు సహకరించకపోవడంతోనే ఫలితాలు తారుమారైనట్లు ఏఐసీసీ గుర్తించింది. ఇలా రాష్ట్రాల వారీగా క్షుణ్ణంగా ఫలితాలను సమీక్షించిన ఏఐసీసీ.. ఆయా రాష్ట్రాల్లో సీట్లు తగ్గడానికి గల కారణాలను అన్వేషించటానికి నిజనిర్ధారణ కమిటీలను వేసింది.
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిషా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటకకి కాంగ్రెస్ అధిష్ఠానం నిజనిర్దారణ కమిటీలను పంపింది. నిజనిర్దారణ కమిటీ సభ్యులు ఇప్పటికే పి.జె.కురియన్, రాకిబల్ హుస్సేన్ హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణలో 14 పార్లమెంట్ నియోజకవర్గాల్లో తప్పకుండా గెలుస్తామన్న విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఏఐసీసీ భావించగా .. కేవలం 8 స్థానాలకే కాంగ్రెస్ పరిమితమైంది.
దీంతో టికెట్ల కేటాయింపు నుంచి ఎన్నికలయ్యే వరకు తెలంగాణలో చోటు చేసుకున్న పరిణామాలపై.. ఢిల్లీ నుంచి అధిష్టానం పంపిన నిజనిర్ధారణ కమిటీ ఆరా తీయనుంది. తెలంగాణాలో తాజాగా అధికారాన్ని అందించిన ప్రజలు.. పార్లమెంటు స్థానాలలో ఎందుకు వెనుకడుగు వేశారన్నఆలోచనలు అధిష్టానంలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ముఖ్యంగా మహబూబ్ నగర్, మల్కాజిగిరి,ఆదిలాబాద్, చేవెళ్ల, నిజామాబాద్‌లో ఫలితాలపై నిజనిర్ధారణ కమిటీ సభ్యులు ఆరా తీసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE