అమెరికాలో నైట్రోజన్ గ్యాస్ ప్రయోగం ద్వారా దోషికి మరణశిక్ష అమలు చేయడం ఇటీవల చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే. తాజాగా ఈ పద్ధతిలో రెండోసారి శిక్ష అమలు చేశారు. దక్షిణ అలబామా జైలులో దోషి అలాన్ యుగెని మిల్లర్ ముఖానికి అధికారులు మాస్క్ బిగించారు. ఆ తర్వాత నైట్రోజన్ గ్యాస్ను పంపించడం మొదలుపెట్టారు. రెండు నిమిషాల్లోనే కింద పడిపోయిన మిల్లర్.. మరో ఆరు నిమిషాల తర్వాత శ్వాస విడిచినట్లు అధికారులు తెలిపారు. అతడి మరణాన్ని అదికారులు ద్రువీకరించారు. కాగా అలబామాలో ఇలా నైట్రోజన్ గ్యాస్లో మరణశిక్ష అమలుచేయడం ఇది రెండోసారి.
పని చేసే చోట ముగ్గురిని హతమార్చిన కేసులో దోషిగా తేలిన యుగెని మిల్లర్ అనే వ్యక్తికి దక్షిణ అలాబామాలో గురువారం ఈ శిక్షను అమలు చేశారు. ఆయన ముఖానికి మాస్క్ బిగించిన అధికారులు ఆ తర్వాత నెట్రోజన్ గ్యాస్ పంపడం మొదలుపెట్టారు. దీంతో రెండు నిమిషాల్లోనే మిల్లర్ కింద పడిపోయాడు. మరో ఆరు నిమిషాల తర్వాత అతను ప్రాణాలు విడిచినట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఎనిమిది నిమిషాల్లో మరణశిక్ష అమలు పూర్తయినట్లు వెల్లడించారు. కాగా ఈ పద్ధతిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.
కాగా నైట్రోజన్ గ్యాస్‌తో తొలిసారిగా ఓ ఖైదీకి ఈ సంవత్సరం జనవరి 25 అమెరికా సుప్రీం కోర్టు మరణ శిక్ష విధించింది. 1982 నుంచి ఈ పద్ధతిలో ఖైదీలకు మరణశిక్షను విధించడాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన కోర్టు అప్పుడు తొలిసారి అనుమతిచ్చింది. దీంతో తొలిసారిగా కెన్నెత్ స్మిత్ (58) అనే వ్యక్తికి మరణ శిక్ష విధించేందుకు నైట్రోజన్ గ్యాస్ వినియోగించవచ్చని తీర్పు వెలువరించింది. 1988లో ఓ మతాధికారి భార్య ఎలిజబెత్ సెనెట్‌ను హత్య చేసిన కేసులో కెన్నెత్ స్మిత్ (58) అనే వ్యక్తికి ఈ మేరకు మరణ శిక్ష అమలు చేశారు. అయితే విమర్శకులు దీనిని క్రూరమైన చర్యగా పేర్కొన్నారు. స్మిత్ కు శిక్ష అమలు చేసే ముందు ఈ పద్ధతికి వ్యతిరేకంగా ఆయన తరఫు న్యాయవాదులు సుదీర్ఘకాలం పోరాడారు. కానీ కోర్టులో ఆయన ఊరట దక్కలేదు. అంతేకాదు శిక్షను అమలు చేసే సమయంలో స్మిత్ నరకయాతన అనుభవించినట్లు మృతుడి బంధులు ఆరోపించారు.