భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవత్ర రోజురోజుకి పెరుగుతుండడంతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 6,654 కరోనా పాజిటివ్ కేసులు, 137 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా ఒకేరోజు ఇంతపెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. అయితే గత ఐదు రోజులుగా దేశంలో ప్రతిరోజూ 5 వేలకు పైగానే కొత్త కేసులు నిర్ధారణ అవుతున్నాయి. మే 23, శనివారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,25,101 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3,720 కి చేరింది. కరోనా బాధితుల్లో 51,783 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 69,597 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళ నాడు, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువుగా ఉంది. మహారాష్ట్రలో కరోనా కేసులు 44582 కు చేరగా, వీరిలో 12,583 మంది కోలుకున్నారు, 1517 మంది మరణించారు. ఇక ఇప్పటిదాకా తమిళనాడు లో 14,753, గుజరాత్ లో 13,273, ఢిల్లీలో 12,319 కేసులు నమోదు అయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu