ఢిల్లీ వద్ద రైతుల ఆందోళనలకు తాత్కాలిక విరామం

Delhi Farmers Protest, Farmers Protest, Farmers Protest Against Farm Bills, Farmers Protest Against Farm Laws, Farmers Protest Against Three Farm Laws, Farmers Protest Highlights, Farmers Protest Postponed, Farmers Protest Postponed News, Farmers Protest Temporarily Postponed, Farmers Protest Temporarily Postponed At Delhi, Mango News, Mango News Telugu

దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులలో గత కొన్ని నెలల నుంచి నిరసనలు తెలియజేస్తున్న రైతులు తమ ఆందోళనలను తాత్కాలికంగా వాయిదా వేశారు. కేంద్రం తీసుకువచ్చిన కొత్త సాగు చట్టాలపై రైతులు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రైతులను ఆందోళనలను విరమించాల్సిందిగా కోరింది. దీనిపై రైతులు కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తెచ్చారు. కేంద్రం కూడా వారి డిమాండ్లపై సానుకూలంగా స్పందించింది. రైతుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటామని, కానీ వారు రాజధానిని వదిలి వెళ్ళవలసినదిగా కోరింది.

దీంతో రైతులు, రైతు సంఘాలు, రైతు ఉద్యమ నాయకులు అందరూ దీనిపై సమాలోచనలు జరిపారు. వారు తమ ఆందోళనలను తాత్కాలికంగా వాయిదావేసి రాజధానిని వదిలి వెళ్ళటానికి నిర్ణయించుకున్నారు. ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతమైన సింఘా వద్ద తమ గుడారాలను ఖాళీ చేస్తున్నారు. కొన్ని నెలల అనంతరం తమ స్వస్థలాలకు తిరిగి వెళ్తున్నారు. కాగా, కనీస మద్దతు ధర, కేసుల ఎత్తివేతపై కేంద్రం నుంచి హామీ లేఖ అందిందని భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు రాకేష్ సింగ్ టికాయత్ తెలిపారు. దీంతో తమ ఆందోళనలను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − two =