దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తుంది. ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. జూన్ 5, శుక్రవారం నాటికి మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 80,229 కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 2436 కొత్త కేసులు నమోదవగా, ఈ రోజు కరోనా వలన 139 మంది మృతి చెందారు. దీంతో ఆ రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 2,849 కి చేరింది. మొత్తం కేసుల్లో 35,156 మంది కోలుకోగా, ప్రస్తుతం 42,224 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu