కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో ఇతర రాష్ట్రాలలో ఉంటున్న వాళ్ళు సొంత ఊర్లకు వెళ్లలేక, ప్రస్తుతం పని చేస్తున్ననగరాల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. వీరందరికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆహారం, బస వసతి కల్పిస్తున్నాయి. వీరితో పాటుగా ఇతర పౌరులకు సహాయం అందించే దిశగా టెక్నాలజీ దిగ్గజ సంస్థ గూగుల్ ముందుకొచ్చింది. గూగుల్ మ్యాప్స్ ద్వారా ప్రస్తుతానికి దేశంలో 30 నగరాల్లో ఆహారం, రాత్రిళ్ళు బస చేయడానికి షెల్టర్లు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో చూపించనున్నారు. వినియోగదారులు తమ సమీపంలో ఉన్న పబ్లిక్ ఫుడ్ షెల్టర్స్ లేదా పబ్లిక్ నైట్ షెల్టర్స్ వివరాలు తెలుసుకోవడానికి వారి స్మార్ట్‌ఫోన్ లలో గూగుల్ మ్యాప్స్ యాప్ కలిగి ఉండాలి. అలాగే గూగుల్ అసిస్టెంట్ ద్వారా కూడా ఈ వివరాలు లభించనున్నాయి. ఈ వివరాల కోసం ‘ఫుడ్ షెల్టర్స్ ఇన్’ లేదా ‘నైట్ షెల్టర్స్ ఇన్’ అని టైప్ చేసి వివరాలు పొందవచ్చని వెల్లడించారు.
ఈ సహాయ కేంద్రాల వివరాలు తెలియజేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నామని గూగుల్ సంస్థ ప్రకటించింది. ఈ సేవలు ఇప్పుడు ఇంగ్లీష్ బాషలోనే అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే హిందీతో పాటుగా ఇతర భారతీయ భాషల్లో కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. స్మార్ట్‌ఫోన్ లేనివారికి ట్రాఫిక్ సిబ్బంది, ఇతర ప్రభుత్వ అధికారులు, వాలంటీర్లు, ఎన్‌జీవోలు, ఇతర ప్రజలు ఈ వివరాలను తెలియజేసి సాయపడాలని పేర్కొన్నారు. ముందుగా @MyGovIndia ఆదివారం నాడు ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ సదుపాయాన్ని ప్రజలు ముందుకుతేగా, సోమవారం నాడు గూగుల్ సంస్థ పత్రికా ప్రకటన విడుదల చేయడం ఈ విషయాన్ని ధృవీకరించింది.
Government is working towards the safety of stranded & migrant people and is providing them with all the essential services. Now, public Food Shelters and Night Shelters can be found on Google maps. #IndiaFightsCorona pic.twitter.com/BwAjCR2FzF
— MyGovIndia (@mygovindia) April 6, 2020
Working closely with @mygovindia, we are now surfacing locations of food shelters & night shelters on Google Maps, Search and Google Assistant, to help migrant workers & affected people across cities.
Please help this reach those who need it most.@PMOIndia @GoI_MeitY @rsprasad pic.twitter.com/g9LwYfikrW
— Google India (@GoogleIndia) April 6, 2020
This feature is currently live in 30+ cities. We’re working towards adding more locations, and will shortly roll this feature out in Hindi and other languages. pic.twitter.com/oGm9xeDvcA
— Google India (@GoogleIndia) April 6, 2020