కరోనా మరణాల తప్పుడు క్లెయిమ్‌లపై, కేంద్రానికి కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు

Supreme Court Allows Centre To Probe Fake Ex-Gratia Claims of Covid Deaths, Probe Fake Ex-Gratia Claims of Covid Deaths, Supreme Court, Fake Ex-Gratia Claims of Covid Deaths, Ex-Gratia Claims of Covid Deaths, Covid Deaths, India Covid Deaths, India Covid-19 Deaths, India Covid-19 Updates, India Covid-19 Live Updates, India Covid-19 Latest Updates, Coronavirus, coronavirus India, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, India Department of Health, India coronavirus, India coronavirus News, India coronavirus Live Updates, Mango News, Mango News Telugu,

కోవిడ్ -19 కారణంగా కుటుంబ సభ్యుల మరణానికి సంబంధించిన ‘నకిలీ ఎక్స్‌గ్రేషియా క్లెయిమ్‌ల’పై దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వానికి అనుమతినిచ్చింది. ఫేక్ క్లెయిమ్‌ల వెరిఫికేషన్ కోసం శాంపిల్ సర్వే కోరుతూ కేంద్రం వేసిన పిటిషన్‌పై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం, అనుమానిత ఫేక్ క్లెయిమ్‌లు ఎక్కువగా ఉన్న నాలుగు రాష్ట్రాల్లోని ఐదు శాతం క్లెయిమ్‌లను వెరిఫై చేయటానికి కేంద్రానికి అనుమతినిచ్చింది. ఫేక్ క్లెయిమ్‌లు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్న రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ మరియు కేరళలలో క్లెయిమ్‌లు మరియు నమోదైన మరణాల మధ్య చాలా వ్యత్యాసం ఉన్నట్లు కనుగొనబడింది. దేశవ్యాప్తంగా తప్పుడు క్లెయిమ్‌లపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇది దుర్వినియోగం అవుతుందని ఊహించలేదని పేర్కొంది.

అలాగే మరణాల క్లెయిమ్‌ల కోసం మార్చి 28 వరకు 60 రోజుల గడువును మరియు భవిష్యత్తులో బాధిత కుటుంబ సభ్యులు ₹50,000 ఎక్స్‌గ్రేషియా పరిహారం క్లెయిమ్ చేయడానికి 90 రోజుల గడువును కూడా సుప్రీంకోర్టు విధించింది. గతంలో కోవిడ్ 19 కారణంగా మరణించిన వ్యక్తులపై పరిహారం చెల్లింపును క్లెయిమ్ చేయడానికి నాలుగు వారాల గడువును నిర్ణయించాలని అధికారులను అభ్యర్థిస్తూ కేంద్రం ఒక దరఖాస్తును దాఖలు చేసింది. గత విచారణ సందర్భంగా, దుర్వినియోగం గురించి దర్యాప్తు చేయడానికి కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ విచారణ అవసరమని బెంచ్ భావించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి భారతదేశంలో 5.16 లక్షల కోవిడ్-సంబంధిత మరణాలు నమోదయ్యాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ మరియు కేరళ కలిపి 2.36 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =