దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య ఒక కోటి దాటింది. గత 24 గంటల్లో 19,587 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోవడంతో రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 1,00,16,859 కు చేరుకుంది. దీంతో దేశంలో కరోనా రికవరీ రేటు 96.36 శాతంగా నమోదైంది. మరోవైపు కొత్తగా 20,346 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో గురువారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 1,03,95,278 కు చేరుకుంది. ఇక కరోనాతో మరో 222 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,50,336 కి పెరిగింది. దేశంలో మరణాల రేటు 1.45 శాతంగా ఉంది.
దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్స్ లో ప్రస్తుతం 2,28,083 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాలలో కరోనా కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా నమోదైనా 20,346 కేసులలో 83.88 శాతం ఈ 10 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ