దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. వ్యాక్సిన్ పంపిణి ప్రారంభించిన 25 వ రోజైన ఫిబ్రవరి 9, మంగళవారం నాడు మొత్తం 7,990 సెషన్స్ లో 3,52,553 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇక ఫిబ్రవరి 10, బుధవారం ఉదయం 8 గంటల వరకు దేశంలో 66 లక్షలకు పైగా (66,11,561) మంది లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. వీరిలో 56,10,134 హెల్త్ కేర్ వర్కర్స్, 10,01,427 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్స్ ఉన్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికి 3,25,538 మంది, తెలంగాణలో 2,43,665 మంది లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్ వేశారు.
రాష్ట్రాల వారీగా కరోనా వ్యాక్సినేషన్ వివరాలు:
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ