జూలై 15 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు పొడిగింపు

DGCA, Flights Remain Suspended, international commercial flights, International Flight suspension, International Flight suspension news, International Flights, International Flights Remain Suspended till July 15, national news, national news today

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసుల పై రద్దు కొనసాగుతుండగా, తాజాగా మరోసారి రద్దు గడువును పొడిగిస్తూ డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 15 అర్ధరాత్రి 11.59 గంటల వరకు అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. రద్దుపై మే 30, 2020 న ఇచ్చిన ఉత్తర్వులు యధాతంగా కొనసాగుతాయని డీజీసీఏ ప్రకటించింది. అయితే అంతర్జాతీయ కార్గో విమానాలకు, డీజీసీఏ అనుమతించే స్పెషల్ విమానాలకు ఈ నిబంధనలు వర్తించవని స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu