పాకిస్థాన్‌ నుంచి వాట్సాప్ కాల్స్‌ .. ఇండియన్‌ ఆర్మీ హెచ్చరిక

Indian Army Warns Students About New WhatsApp Scam Related To Pakistan,Indian Army Warns Students,Warns Students About New WhatsApp Scam,WhatsApp Scam Related To Pakistan,New WhatsApp Scam,Indian Army Warns New WhatsApp Scam,Mango News,Mango News Telugu,Pakistan Targeting Army Schools,Indian Army warns military personnel,Alarming Espionage Attempt,Pakistan Intel Spying Attempt, Calls from Pakistan, Indian Army warns WhatsApp users, WhatsApp users,Indian Army Latest News,Indian Army Latest Updates,New WhatsApp Scam News Today,New WhatsApp Scam Latest News,Pakistan WhatsApp Scam Live Updates

కొద్ది రోజులుగా ఇండియా ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌తో పాటు చాలా మంది విద్యార్థులకు.. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ నుంచి కాల్స్‌, వాట్సాప్‌ మెసేజ్‌లు వస్తున్నట్లు ప్రత్యేక కథనాలు వినిపిస్తున్నాయి. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌ కు చెందిన గ్యాడ్జెట్స్‌ నౌ చెప్పిన దాని ప్రకారం, కొన్ని ప్రత్యేక నంబర్ల నుంచి విద్యార్ధులకు కాల్స్, మెసేజులు వస్తున్నాయి. వారిని సోషల్ మీడియా గ్రూపులలో చేరాలని.. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్‌ను పంచుకోవాలని కోరుతున్నాయని ఇండియన్ ఆర్మీ గురించి కథనాలు పంచుకోవాలని గుర్తించినట్లు కథనాలు వచ్చాయి.

విద్యార్దులకు కాల్స్ చేస్తున్నవారు తమను తాము స్కూలుకు చెందిన ఉపాధ్యాయులుగా చెప్పుకుంటూ.. కొత్త క్లాసుల కోసం ఏర్పాటు చేసిన గ్రూపులలో చేరాలని స్టూడెంట్స్ ను కోరుతున్నారు. దీనికోసం ఓటీపీలను కూడా పంపుతున్నారు. అంతేకాదు.. తాము టీచర్లమేనని విద్యార్థులను నమ్మించడానికి ఆ స్టూడెంట్స్ కు తెలిసిన వారి పేర్లు కూడా చెబుతున్నారు.

అయితే ఈ ఇలాంటి మెసేజులు కానీ కాల్స్ కానీ నార్మల్‌గా కాకుండా కేవలం వాట్సాప్ నుంచే వస్తున్నట్లు గ్యాడ్జెట్స్‌ నౌలో కథనాలు వినిపించాయి. దీంతో ఆర్మీ అధికారులు అలర్ట్ అయ్యారు. కానీ ఇలా విద్యార్థులకు తరచూ వస్తున్న రెండు అనుమానాస్పద నంబర్‌లను మాత్రమే అధికారులు గుర్తించారు. అయితే ఇవి పాకిస్తాన్ నుంచి వస్తున్నట్లు అనుమానిస్తున్నారు. 8617321715, 9622262167 నంబర్ల నుంచి కాల్స్ వస్తున్నట్లు గుర్తించి.. వీటి గురించి స్టూడెంట్స్ ను, సిబ్బందిని ఆర్మీ పబ్లిక్‌ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, అధికారులు హెచ్చరించారు.

చదువు కోసమే కదా అని చాలా మంది విద్యార్థులు ఈ గ్రూపులలో చేరుతున్నారు. ఇలా గ్రూపుల్లో చేరుతున్న స్టూడెంట్స్ నుంచి .. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్‌ను సేకరిస్తున్నారు అవతలి వ్యక్తులు. విద్యార్థుల తండ్రి చేస్తున్న ఉద్యోగం, వారివారి ఉపాధ్యాయుల పేర్లు, ఆ టీచర్లకు సంబంధించిన ఇతర సమాచారం అడుగుతున్నారు.

ఈ విషయంపై స్కూల్స్, కాలేజీల టీచర్లు, లెక్చరర్లు, ప్రిన్పిపాల్స్ ముందుకు వచ్చి.. తమ విద్యార్థులను చైతన్యపరచాలని ఆర్మీ అధికారులు కోరుతున్నారు. తాము రెండు నంబర్లనే గుర్తించామని.. కానీ వేరువేరు నంబర్ల నుంచి కూడా ఈ కాల్స్, మెసేజెస్ వస్తున్నట్లు తాము అనుమానిస్తున్నామని అంటున్నారు. అందుకే విద్యార్థులు, ఉపాధ్యాయులు, పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 7 =