నీరవ్‌ మోదీకి ఈడీ షాక్, మరో రూ.253.62 కోట్ల విలువైన ఆస్తులు సీజ్

ED Attaches Assets Worth of Rs 253.62 Cr of Nirav Modi Group of Companies in Hong Kong, Enforcement Directorate Attaches Assets Worth of Rs 253.62 Cr of Nirav Modi Group of Companies in Hong Kong, Nirav Modi Group of Companies in Hong Kong, fugitive diamond merchant Nirav Modi as part of a money laundering probe, money laundering probe, Enforcement Directorate, ED Attaches Assets Worth of Rs 253.62 Cr, 253.62 Cr of Nirav Modi Group of Companies in Hong Kong, Nirav Modi Group of Companies, Hong Kong Nirav Modi Group of Companies, Nirav Modi money laundering probe, All these moveable assets are in Hong Kong, Nirav Modi, Nirav Modi money laundering probe News, Nirav Modi money laundering probe Latest News, Nirav Modi money laundering probe Latest Updates, Nirav Modi money laundering probe Live Updates, Mango News, Mango News Telugu,

పంజాబ్‌ నేషనల్ బ్యాంకు ఫ్రాడ్ కేసులో నిందితుడు, పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం మరో షాక్ ఇచ్చింది. హాంకాంగ్‌లోని నీరవ్ మోడీ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు సంబంధించి రూ.253.62 కోట్ల (జూలై 22, శుక్రవారం వరకు) విలువైన రత్నాలు, ఆభరణాలు మరియు బ్యాంక్ బ్యాలెన్స్‌లను తాత్కాలికంగా జప్తు/అటాచ్ చేస్తునట్టుగా ఈడీ ప్రకటించింది. ఈ తరలించదగిన ఆస్తులన్నీ హాంకాంగ్‌లో ఉన్నాయని ఈడీ తెలిపింది. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అటాచ్/జప్తు చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ.2650.07 కోట్లుకు చేరిందని ఈడీ తెలిపింది.

మనీలాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ల కింద నీరవ్ మోదీ ఆస్తులు తాత్కాలికంగా అటాచ్ చేయబడ్డాయి. ముందుగా పంజాబ్‌ నేషనల్ బ్యాంకులో ఫ్రాడ్ కేసు వ్యవహారం 2018లో బయటపడగా, నీరవ్ మోదీ అప్పటికే దేశం విడిచి పరారయిన విషయం తెలిసిందే. ఈ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరిగా ఉన్న నీరవ్ మోదీ ప్రస్తుతం యూకేలో జైలులో ఉన్నారు. ఈ కేసులో మనీలాండరింగ్ అంశంపై ఈడీ దర్యాప్తు జరుపుతూ వరుసగా ఆయన ఆస్తులను అటాచ్ చేస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY