కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గేకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

PM Modi Extends his Wishes to Mallikarjun Kharge for Elected as the New President of the Congress party, PM Modi Wishes Mallikarjun Kharge, Congress Presidencial Elections, Indian National Congress New President, Mallikarjun Kharge New President, Indian National Congress New President Mallikarjun Kharge, Mango News, Mango News Telugu, Congress President Election, Sonia Gandhi Rahul Priyanka Voted , Candidates Kharge Sashi Tharoor,Aicc President Rahul Gandhi, Rahul Gandhi Aicc President, All India Congress Committee , Indian National Congress, Sonia Gandhi, Mallikarjun Kharge

కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొత్త బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున్ ఖర్గే జీకి నా శుభాకాంక్షలు. ఆయనకు మున్ముందు ఫలవంతమైన పదవీకాలం ఉండాలని కోరుకుంటున్నాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

అలాగే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలుగా ఉన్న సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం మధ్యాహ్నం కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గే నివాసానికి చేరుకొని, అభినందనలు తెలియజేశారు. ఇక దీపావళి పండుగ అనంతరం ఈ నెల 26న మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించనున్నారు.

ముందుగా అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు జరగగా, నేడు (అక్టోబర్ 19, బుధవారం) కౌంటింగ్‌ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తన ప్రత్యర్థి, కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ శశి థరూర్ పై 6825 ఓట్ల తేడాతో మల్లికార్జున్ ఖర్గే ఘనవిజయం సాధించి, కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 9,835 ఓట్లు పోల్ అవగా, మల్లిఖార్జున్ ఖర్గేకు 7,897 ఓట్లు రాగా, శశిథరూర్‌కు 1,072 ఓట్లు వచ్చాయి. 416 ఓట్లు చెల్లలేదని పార్టీ ఎన్నికల విభాగం రిటర్నింగ్ ఆఫీసర్ మధుసూదన్ మిస్త్రీ వెల్లడించారు. మెజారిటీ ఓట్లు సాధించిన మల్లికార్జున్ ఖర్గే ను కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నట్టు మధుసూదన్ మిస్త్రీ పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 15 =