లోక్ సభలో స్పీకర్ పదవికి సంబంధించి ట్విస్ట్ నెలకొంది. చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవి కోసం ఎన్నికలు జరగనున్నాయి. 18 లోక్ సభలో స్పీకర్ పోస్టుకు సంబంధించి అధికార ఎన్డీయే.. విపక్ష ఇండియా కూటమి మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని అంతా భావిస్తున్నారు. ఈ తరుణంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఎన్డీయే చివరికొచ్చే సరికి ప్లేట్ ఫిరాయించడంతో.. అటు ఇండియా కూటమి సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియా కూటమికి చెందిన ఎంపీ స్పీకర్ పదవి కోసం నామినేషన్ దాఖలు చేశారు.
ఇప్పటి వరకు లోక్ సభలో స్పీకర్ పదవి కోసం ఎన్నికలు జరగలేదు. అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరి ఏకగ్రీవంగానే స్పీకర్‌ను ఎన్నుకుంటున్నారు. అయితే ఈసారి డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇస్తామని ముందు ఎన్డీయే కూటమి ప్రకటించింది. తద్వారా తాము నిలబెట్టి అభ్యర్థికి మద్ధతు ఇవ్వాలని విపక్షలను ఎన్డీయే కూటమి కోరింది. అందుకు ఇండియా కూటమి కూడా అంగీకరించింది. కానీ చివరి నిమిషంలో ఎన్డీయే ప్లేటు ఫిరాయించింది. తర్వాత విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పోస్టు విషయంలో ఎన్డీయే మౌనంగా ఉండిపోయింది.
అటు స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఇండియా కూటమి చివరి నిమిషంలో కేరళలోని మావెలిక్కర సీటు నుంచి ఎనిమిదోసారి గెలుపొందిన కాంగ్రెస్ ఎంపీ కొడికు్ననిల్ సురేష్‌ను స్పీకర్ రేసులోకి దించింది. మంగళవారం స్పీకర్ పదవికి ఇండియా కూటమి తరుపున సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. అటు గత లోక్ సభలో 115 మంది విపక్ష ఎంపీలను ఓం బిర్లా సస్పెండ్ చేసి చెడ్డపేరు మూటకట్టుకున్నారు. మరోసారి ఆయనకే స్పీకర్ పదవిని ఇవ్వడంతో ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్.. ఎన్నికలకు తెరలేపింది. రేపు స్పీకర్ పదవి కోసం ఎన్నికలు జరగనున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ