తిరుమల శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్

Supreme Court Chief Justice DY Chandrachud Offered Prayers at Tirumala Temple Today,Supreme Court Chief Justice DY Chandrachud,Chief Justice DY Chandrachud,DY Chandrachud Offered Prayers,Mango News,Mango News Telugu,Tirumala Temple,TTD Latest News and Updates,Senior Citizens,Challenged Persons Tickets,December Quota,Tirumala,Tirupati,Tirumala Tirupathi Devasthanam,TTD Latest News And Live Updates,December Quota TTD, TTD,Tirumala Tirupathi Devasthanam News and Live Upadtes

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ గురువారం ఉద‌యం తొలిసారిగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ కు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో(ఎఫ్ఏసి) అనిల్ కుమార్ సింఘాల్, అర్చకులు కలిసి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వామివారి మహత్యాన్ని, ఆలయ చరిత్రను అర్చకులు వివరించారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్ కు వేద‌ పండితులు వేదాశీర్వచనం అందించారు.

అనంతరం అనంతరం టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి చీఫ్ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్ కు తీర్థప్రసాదాలు, డ్రైఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన శ్రీవారి చిత్రపటం, 2023 టీటీడీ క్యాలెండర్‌, డైరీలను చైర్మన్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో(ఎఫ్ఏసి) వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబు, విజివోలు బాలిరెడ్డి, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 2 =