లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే రూ. 1,11,11,111 రివార్డు

Encounter Lawrence Bishnoi Rs 11111111 Reward, Lawrence Bishnoi Encounter Reward, Encounter Reward, Lawrence Bishnoi Encounter, Rs 11111111 Reward For Lawrence Bishnoi, Encounter Lawrence Bishnoi Reward, Kshatriya Karni Sena, Lawrence Bishnoi, Karni Sena Offers Reward, Lawrence Bishnoi Case, Lawrence Bishnoi Gang, Salman Khan, Bollywood, Bollywood News, Bollywood Live Updates, Bollywood Latest News, Movie News, Movie Updatwes, Mango News, Mango News Telugu

ప్రస్థుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే కోటి 11లక్షల 11వేల 11వందల 11 రూపాయిల రివార్డ్ ఇస్తామని కర్ణిసేన బహిరంగంగా ప్రకటించింది. ఈ మేరకు కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం రాజ్ షెకావత్‌కు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స్నేహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతి జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్‌ ఎన్‌కౌంటర్ చేసిన ఏ పోలీసు అధికారికైనా వారి భద్రత, కుటుంబ భవిష్యత్తు కోసం రూ.1.11 కోట్లకు పైగా ఇస్తాం… ఈ ముఠా ఎన్ని హత్యలకు పాల్పడుతున్నా కేంద్ర ప్రభుత్వం, గుజరాత్‌ అధికారులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.. మా అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి ప్రాణాలు తీసినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అని బీజేపీ ప్రభుత్వంపై రాజ్ షెకావత్ విమర్శలు గుప్పించారు.

దేశ ప్రజలకు భయం లేని భారతదేశం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలు భయం లేకుండా జీవించాలంటే లారెన్స్ బిష్ణోయ్ వంటి వ్యక్తులు ఉండకూడదని తెలిపారు. ప్రజలను భయపెట్టే వ్యక్తులతో దేశానికి ఎప్పుడూ ప్రమాదమేనన్నారు. బిష్ణోయ్ గ్యాంగ్ అరాచకాలు వెలుగులోకి రావడంతో ప్రస్తుతం కర్ణిసేన లారెన్స్ బిష్ణోయ్‌ను లక్ష్యంగా చేసుకుంది.

గతేడాది డిసెంబర్‌ 5న రాష్ట్రీయ రాజ్‌పుత్‌ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగామేడీ.. గుర్తుతెలియని వ్యక్తులు కాల్పుల్లో చనిపోయారు. తామే అతడ్ని హత్య చేసినట్టు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ తర్వాత ప్రకటించింది. దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను విస్తరించి, నేర సామ్రాజ్యాన్ని నడుపుతోన్న లారెన్స్ బిష్ణోయ్.. మరో దావూద్ ఇబ్రహీంలా తయారయ్యాడు.

లారెన్స్‌ బిష్ణోయ్‌ 1993లో పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ జిల్లా ధత్తరన్‌వాలిలో పుట్టాడు. ఇతడి తండ్రి హరియాణా పోలీస్‌ కానిస్టేబుల్‌. కృష్ణ జింకలను అమితంగా ఆరాధించే బిష్ణోయ్‌ వర్గానికి చెందిన లారెన్స్‌ చండీగఢ్‌లోని పంజాబ్‌ యూనివర్సిటీలో చదివే సమయంలో విద్యార్థి నాయకుడు. ఇదే కమ్రంలో గోల్డీ బ్రార్‌ పరిచయమై నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు. కాలేజీ గ్యాంగ్‌ వార్‌లో తన స్నేహితురాలిని సజీవ దహనం చేయడం.. లారెన్స్‌లో తీవ్ర కసిని పెంచింది. రాజస్థాన్‌లో కృష్ణ జింకలను చంపిన కేసులో నిందితుడైన సల్మాన్‌ఖాన్‌ను హత్య చేసేందుకు ప్రణాళిక వేయడం ద్వారా లారెన్స్‌ వార్తల్లోకెక్కాడు. ఇతడి గ్యాంగ్‌ కార్యకలాపాలు పంజాబ్‌, ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లకు విస్తరించాయి.