జీ7 సమ్మిట్: కెన‌డా ప్ర‌ధానమంత్రి జస్టిన్ ట్రూడోతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక స‌మావేశం

PM Modi held Bilateral meeting with the PM of Canada Justin Trudeau on the Sidelines of the G7 Summit, Modi held Bilateral meeting with the PM of Canada Justin Trudeau on the Sidelines of the G7 Summit, PM of Canada Justin Trudeau on the Sidelines of the G7 Summit, PM Modi held Bilateral meeting with the PM of Canada Justin Trudeau, PM of Canada Justin Trudeau, PM Modi held Bilateral meeting, Sidelines of the G7 Summit, PM of Canada Justin Trudeau, Canada PM Justin Trudeau, PM Justin Trudeau, Justin Trudeau, Bilateral meeting, G7 Summit, PM Modi Bilateral meeting News, PM Modi Bilateral meeting Latest News, PM Modi Bilateral meeting Latest Updates, PM Modi Bilateral meeting Live Updates, Mango News, Mango News Telugu,

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ జర్మనీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ ఓలాఫ్ స్కోల్జ్ ఆహ్వానం మేరకు జూన్ 26-27 తేదీల్లో జర్మన్ ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో జరిగే జీ7 సమ్మిట్ లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ జర్మనీ వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా జీ7 సమ్మిట్ పాల్గొని ప్రసంగించడంతో పాటుగా, సమ్మిట్ సందర్భంగా పాల్గొన్న పలు దేశాల నాయకులతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. అందులో భాగంగా జూన్ 27, సోమవారం నాడు ప్ర‌ధాని మోదీ జర్మనీలోని ష్లోస్ ఎల్మౌలో కెన‌డా ప్ర‌ధాన మంత్రి జస్టిన్ ట్రూడోతో ద్వైపాక్షిక స‌మావేశం నిర్వ‌హించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

భాగస్వామ్య విలువలతో కూడిన బలమైన ప్రజాస్వామ్య దేశాల నాయకులుగా వారు ప్రోడక్టీవ్ సమావేశాన్ని నిర్వహించారని, ఈ సందర్భంగా వారు భారత్-కెనడా ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించారని తెలిపారు. అలాగే వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మరింత పటిష్టం చేయడానికి, భద్రత, ఉగ్రవాదాన్ని నిరోధించడంలో సహకారం, ప్రజల మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేయడానికి అంగీకరించారని చెప్పారు. అలాగే పరస్పర ఆసక్తి ఉన్న ప్రపంచ, ప్రాంతీయ సమస్యలపై కూడా వారు అభిప్రాయాలను పంచుకున్నారని తెలిపారు.

అలాగే యూరోపియ‌న్ క‌మీష‌న్ అధ్య‌క్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ తో కూడా ప్రధాని మోదీ సమావేశమయ్యారు. రైసినా డైలాగ్ సందర్భంగా వాన్ డెర్ లేయెన్ ఏప్రిల్ 2022లో ఢిల్లీలో చేసిన ప్రోడక్టీవ్ పర్యటనను ప్రధాని గుర్తు చేసుకున్నారు. భారత్ మరియు ఈయూ మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, జీఐ ఒప్పందాలపై చర్చలు పునఃప్రారంభం కావడంపై నేతలు సంతోషం వ్యక్తం చేశారు. డిజిటల్ సహకారం, వాతావరణ చర్య, సాంకేతికత అండ్ ఆవిష్కరణలతో సహా వివిధ రంగాలలో భారత్-ఈయూ ఎంగేజ్మెంట్స్ ను సమీక్షించారు. అదేవిధంగా సమకాలీన ప్రపంచ, ప్రాంతీయ పరిణామాలపై కూడా ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

మరోవైపు జీ7 సమ్మిట్‌కు హాజరైన తర్వాత ప్రధాని మోదీ జూన్ 28న యూఏఈ చేరుకుని, యూఏఈ మాజీ అధ్యక్షుడు మరియు అబుదాబి పాలకుడు అయిన షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరణించినందుకు వ్యక్తిగతంగా సంతాపాన్ని వ్యక్తం చేస్తారు. అదేవిధంగా యూఏఈ యొక్క కొత్త అధ్యక్షుడిగా మరియు అబుదాబి పాలకుడిగా ఎన్నికైన షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను కూడా ఈ సందర్భంగా ప్రధాని మోదీ అభినందించనున్నారు. ఇక జూన్ 28 రాత్రి ప్రధాని మోదీ యూఏఈ నుంచి బయలుదేరి, ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + eight =