జైలు నుంచి విడుదలైన వీకే శశికళ

AIADMK, Ex-AIADMK leader Sasikala released, Ex-AIADMK Leader VK Sasikala, Ex-AIADMK Leader VK Sasikala Released From Jail, Mango News, Sasikala Latest News, Sasikala News, Sasikala Released From Jail, Sasikala to be released from Bengaluru, VK Sasikala, VK Sasikala released from Bengaluru jail, VK Sasikala Released From Jail, VK Sasikala released from prison

అన్నాడీఎంకే మాజీ నాయకురాలు, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు వీకే శశికళ బుధవారం నాడు జైలు నుంచి విడుదలయ్యారు. అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో నాలుగేళ్ల పాటుగా ఆమె జైలు శిక్ష అనుభవించారు. శశికళకు ఇటీవలే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ప్రస్తుతం బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విక్టోరియా ఆసుపత్రిలోనే జైలు నుంచి విడుదలకు సంబంధించిన అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగానే ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. వైద్యులతో సంప్రదించిన తరువాత ఆమె డిశ్చార్జ్ విషయంపై నిర్ణయం తీసుకుంటామని శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్​ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ