గతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఫలితాలు ఎప్పుడొస్తాయా అని అందరూ ఎదురు చూసి..తమకు అనుకూలమైన ఫలితాలొస్తే సంబరాలు చేసుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఫలితాల కంటే ముందే వచ్చిన ఎగ్జిట్ పోల్స్‌కు అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా రిలీజయిన ఎగ్జిట్ పోల్స్ కూడా చాలామందిలో జోష్ పెరిగింది. ముఖ్యంగా ఎన్డీయేకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఉండటంతో ఆ నేతలు ఇప్పటి నుంచే సంబరాలకు రెడీ అయిపోయారు. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే తామే మళ్లీ అధికారంలోకి వస్తామని ఫిక్స్ అయిపోయారు.
ఈ ఎగ్జిట్ పోల్ ప్రభావం ఇటు స్టాక్ మార్కెట్లపైన కూడా గట్టిగానే పడింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో సోమవారం భారత షేర్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.నిఫ్టీ 50 3.58% జంప్ చేయగా.. సెన్సెక్స్ 3.55% లాభపడింది. సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిల్లో ఉండగా..నిఫ్టీ బ్యాంక్ తొలిసారి 50,000 దాటింది . ఫిబ్రవరి నుంచి అత్యుత్తమ ఇంట్రాడే లాభాలతో ఆల్-టైమ్ గరిష్టాలను తాకడంతో ఆర్థిక నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఎగ్జిట్ పోల్స్ ప్రభావంతో అన్ని ప్రధాన రంగాల స్టాక్స్ బాగా పెరిగాయి. ముఖ్యంగా స్మాల్, మిడ్ క్యాప్‌లు కూడా గణనీయమైన లాభాలను చవి చూశాయి. అధికార పక్షానికి మూడింటిలో.. రెండు వంతుల మెజారిటీ వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ సూచించడంతో.. స్టాక్ మార్కెట్ రయ్ మని దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ విశ్వసనీయతపై అన్ని వర్గాలలో మిశ్రమ స్పందన ఉన్నా.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ మాత్రం పాజిటివ్ గా రెస్పాండ్ అవడం చూసి నిపుణులు ఆశ్చర్యపోతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE