కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమం కొనసాగిసున్న సంగతి తెలిసిందే. రైతులు చేపడుతున్న ఉద్యమం ఏడు నెలలు పూర్తికావస్తున్న సందర్భంగా రైతు సంఘాలు మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. జూన్ 26న దేశవ్యాప్తంగా రాజ్‌భవన్ల వద్ద ధర్నాలు చేపట్టనున్నట్టు 40కి పైగా రైతు సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. “జూన్ 26 న గవర్నర్ల నివాసాలైన రాజ్‌భవన్‌ల ముందు నల్ల జెండాలతో ధర్నాలు నిర్వహిస్తాం. అలాగే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు మెమోరాండం పంపిస్తాం. జూన్ 26 ను సేవ్ ఫార్మింగ్, సేవ్ డెమొక్రసీ (వ్యవసాయాన్ని కాపాడుదాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం) డే గా పాటించాలని నిర్ణయించాం” అని సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులు వెల్లడించారు. ఇప్పటికే తమ ఉద్యమంలో భాగంగా రైతు సంఘాలు రెండు సార్లు భారత్ బంద్, ట్రాక్టర్ల ర్యాలీ, చక్కా జామ్ వంటి కార్యక్రమాలు చేపట్టగా, తాజాగా రాజ్‌భవన్ల వద్ద ధర్నాకు పిలుపునిస్తూ ప్రకటన చేశాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ