బ్లాక్ ఫంగస్ చికిత్స : రాష్ట్రాలకు మరో 19420 అంఫోటెరిసిన్-బి వయల్స్ కేటాయించిన కేంద్రం

19420 Additional Vials of Amphotericin-B, Amphotericin-B, Black Fungus, Black Fungus Cases, Black Fungus Disease, Black Fungus Infections, Black Fungus New Cases, Black Fungus Treatment, Centre Allocates 19420 Additional Vials of Amphotericin-B, Centre Allocates 19420 Additional Vials of Amphotericin-B to States, Increasing Cases Of Black Fungus, Mango News, Mucormycosis, Mucormycosis In India

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మ్యూకోర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. బ్లాక్ ఫంగస్ చికిత్స, మందుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మ్యూకోర్ మైకోసిస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు మే 25న 19,420 అదనపు అంఫోటెరిసిన్-బి వయల్స్ ను కేటాయించినట్లు కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ్ వెల్లడించారు. ఇక ఇప్పటికే మే 21న పలు రాష్ట్రాలకు 23690 అంఫోటెరిసిన్-బి వయల్స్ కేటాయించిన సంగతి తెలిసిందే.

మ్యూకోర్ మైకోసిస్ వ్యాధి చికిత్సలో యాంటీ ఫంగల్ ఔషధమైన అంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్స్ ను కీలకంగా ఉపయోగిస్తున్నారు. మరోవైపు ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్-1897 ప్రకారం మ్యూకోర్ మైకోసిస్ వ్యాధిని నోటిఫై చేయాలని మే 20న కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలను కోరింది. అనుమానిత మరియు నిర్ధారించబడిన మ్యూకోర్ మైకోసిస్ కేసులను ఎప్పటికప్పుడు ఇంటిగ్రేటెడ్ డిసీస్ సర్వైవలెన్స్ ప్రోగ్రాంకు నివేదించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

అంఫోటెరిసిన్-బి వయల్స్ కేటాయింపు (19420):

  1. ఆంధ్రప్రదేశ్ – 1840
  2. బీహార్ – 120
  3. చండీగర్ – 50
  4. ఛత్తీస్ గడ్ – 180
  5. దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యు – 50
  6. ఢిల్లీ – 400
  7. గోవా – 50
  8. గుజరాత్ – 4640
  9. హర్యానా – 640
  10. జమ్మూ అండ్ కాశ్మీర్ – 50
  11. జార్ఖండ్ – 60
  12. కర్ణాటక – 1030
  13. కేరళ – 70
  14. మధ్యప్రదేశ్ – 1470
  15. మహారాష్ట్ర – 4060
  16. ఒడిశా – 50
  17. పంజాబ్ – 200
  18. రాజస్థాన్ – 1430
  19. తమిళనాడు – 100
  20. తెలంగాణ – 700
  21. ఉత్తరప్రదేశ్ – 1260
  22. ఉత్తరాఖండ్ – 70
  23. సెంట్రల్ ఇన్స్టిట్యూఇషన్స్ – 900

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 1 =