తొలి జేమ్స్‌బాండ్‌ పాత్రధారి సీన్‌ కానరీ మృతి

Actor Sean Connery Dies, ames Bond Actor Sean Connery Dies, Former James Bond Actor Sean Connery, Former James Bond Actor Sean Connery Dies, Former James Bond Actor Sean Connery Dies at 90, James Bond Actor, James Bond Actor Sean Connery, Sean Connery

లెజెండరీ స్కాటిష్‌ నటుడు, జేమ్స్‌బాండ్‌ పాత్రధారి‌ సీన్‌ కానరీ కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. 1962 లో మొదటి బాండ్ చిత్రమైన “డాక్టర్ నో” లో తొలిసారిగా జేమ్స్ బాండ్ పాత్రను సీన్ కానరీ పోషించారు. ఆ తర్వాత ఫ్రమ్ రష్యా విత్ లవ్, గోల్డ్ ఫింగర్, థండర్ బాల్, యు ఓన్లీ లైవ్ ట్వైస్, డైమండ్స్ ఆర్ ఫరెవర్ మరియు నెవర్ సే నెవర్ ఎగైన్ చిత్రాల్లో జేమ్స్ బ్యాండ్ పాత్ర పోషించి ప్రేక్షకుల హృదయాల్లో గొప్పస్థానం సంపాదించుకున్నారు. జేమ్స్ బాండ్ పాత్రకు ఆయన ఎంతో గుర్తింపు తెచ్చి, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నారు. సీన్ కానరీ మృతిని యూకే మీడియా ధ్రువీకరించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు విచారంలో మునిగిపోయారు. ప్రతిష్టాత్మక ఆస్కార్‌ పురస్కారం సహా ఎన్నో అవార్డులను సీన్ కానరీ దక్కించుకున్నారు. అలాగే పలు చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు.  సీన్ కానరీ మృతి పట్ల హాలీవుడ్ నటులు సహా సోషల్ మీడియాలో పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ