ప్రధాని మోదీకి 9 డిమాండ్లతో లేఖ రాసిన 12 ప్రతిపక్ష పార్టీల నేతలు

12 Major Opposition Parties Writes a Letter to PM Narendra Modi over Covid Situation,Mango News,Mango News Telugu,12 Opposition leaders write letter to PM Modi,Congress,Coronavirus,Covid-19,Sharad Pawar,Sonia Gandhi,PM Modi,Vaccination,Opposition Writes To PM,Uddhav Thackeray,Uddhav Thackeray Writes To PM,Maharashtra CM,Maharashtra CM News Today,Corona News Today's Update,India,India Corona News Today's Update,Covid 19 India,India Coronavirus,Corona Vaccine,Shortage Of Vaccine India,Free Vaccine In India,Vaccine Shortage India,PM Narendra Modi,PM Narendra Modi Latest News,PM Narendra Modi Live,PM Modi News,PM Modi Latest Updates,Coronavirus India News,Opposition Leaders Write To PM Modi For Free Vaccination Drive,Free Vaccination Drive

దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో 12 ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు సంయుక్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బుధవారం నాడు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ఉచితంగా కరోనా వ్యాక్సినేషన్ చేపట్టడం సహా కరోనా నియంత్రణకు సంబంధించిన 9 డిమాండ్లను లేఖలో పేర్కొన్నారు. ప్రధాని మోదీకి లేఖ రాసిన నేతల్లో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాకరే, టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్‌, జేఎంఎం నేత, జార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్‌, ఫరూక్‌ అబ్దుల్లా, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌, సీపీఐ నేత డి.రాజా, సీపీఎం నేత సీతారాం ఏచూరి ఉన్నారు.

ప్రధాని మోదీకి రాసిన లేఖలో విపక్ష నేతలు పేర్కొన్న డిమాండ్స్ ఇవే:

  1. ప్రపంచం మరియు దేశీయంగా అవకాశమున్న చోట నుండి కేంద్రం వ్యాక్సిన్లను సేకరించాలి.
  2. దేశవ్యాప్తంగా ఉచిత, సార్వత్రిక మాస్‌ వ్యాక్సిన్‌ క్యాంపెయిన్‌ చేపట్టాలి.
  3. దేశీయ వ్యాక్సిన్ ఉత్పత్తిని విస్తరించడానికి తప్పనిసరి లైసెన్సింగ్‌ను ప్రారంభించండి.
  4. బడ్జెట్ లో వ్యాక్సిన్ల కోసం కేటాయించిన రూ.35,000 కోట్లను ఖర్చు చేయండి.
  5. సెంట్రల్ విస్టా నిర్మాణాన్ని ఆపండి. దానికి బదులుగా కేటాయించిన నిధులను ఆక్సిజన్ మరియు వ్యాక్సిన్ల సేకరణ కోసం ఉపయోగించండి.
  6. లెక్కించని ప్రైవేట్ ట్రస్ట్ ఫండ్, పిఎమ్‌కేర్స్‌లో ఉన్న మొత్తం డబ్బును వ్యాక్సిన్లు, ఆక్సిజన్ మరియు అవసరమైన వైద్య పరికరాలను కొనుగోలు చేయడానికి విడుదల చేయండి.
  7. అందరూ నిరుద్యోగులకు కనీసం నెలకు రూ.6000 ఇవ్వండి.
  8. నిరుపేదలకు ఆహార ధాన్యాల ఉచిత పంపిణీ చేయండి.
  9. కరోనా పరిస్థితుల్లో బాధితులుగా మారుతున్న రైతులకు కోసం వ్యవసాయ చట్టాలను రద్దు చేయండి.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =