కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామికి కరోనా పాజిటివ్

#Karnataka, CM Yediyurappa, Karnataka CM BS Yediyurappa tests COVID-19 positive, Karnataka CM BS Yediyurappa tests positive for coronavirus, Karnataka CM Yediyurappa, Karnataka CM Yediyurappa Tested Covid-19 Positive for the Second Time, Karnataka CM Yediyurappa tests positive for Covid-19 twice, Mango News, Yediyurappa, Yediyurappa Tested Covid-19 Positive for the Second Time, Yediyurappa tests COVID-19 positive

కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడుతున్నారు. ఈ క్రమంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తనకు కరోనా సోకిన విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. “నాకు కరోనా పాజిటివ్ తేలింది. గత కొన్ని రోజులుగా నాతో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరూ తమను తాము ఇతరులతో వేరుచేసుకుని, కరోనా పరీక్ష చేయించుకోవాలని అభ్యర్థిస్తున్నాను” అని హెచ్‌డీ కుమారస్వామి ట్వీట్ చేశారు. ఇక ఆయన ఇటీవలే కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు కూడా తీసుకున్నారు. మరోవైపు కుమారస్వామి తండ్రి, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ దంపతులకు కూడా ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ