మార్కెట్‌లో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండ్ తగ్గనే తగ్గదు. కాకపోతే ఇటీవల మరీ టూమచ్‌గా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతుండటంతో సామాన్యులు అటు చూడాలంటేనే భయపడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా వీటి ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారమే.. బంగారం , వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయి. ఒక్కోసారి వీటి ధరలు పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి. మొత్తంగా చూసుకుంటే ఏడాదికేడాది పెరగడమే కానీ తగ్గడం మాత్రం కనిపించలేదు.
తాజాగా..మరోసారి కూడా బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 81వేల960 రూపాయలుగా ఉండగా.. 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర 89వేల 410 గా ఉంది. వెండి కిలో ధర కూడా పెరిగి ఒక లక్షా2వేల100 రూపాయలుగా ఉంది. దేశీయంగా 22 క్యారెట్ల బంగారం 10గ్రాములపై రూ.120 రూపాయలు, 24క్యారెట్లపై రూ.210 రూపాయలు, వెండి కిలోపై ఏకంగా 1200 రూపాయల వరకూ ధర పెరిగింది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర 81,960 రూపాయలు ఉండగా..24 క్యారెట్ల ధర 89,410 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో 22 క్యారెట్ల పుత్తడి ధర 81,960గా ఉండగా.. 24 క్యారెట్ల ధర మాత్రం 89,410 రూపాయలుగానే ఉంది. అలాగే హైదరాబాద్‌లో కిలో సిల్వర్ ధర 1,11,100 రూపాయలుగా ఉండగా
విజయవాడ, విశాఖపట్నంలో కూడా అదే ధర ఉంది. మొత్తంగా ఎప్పటికప్పుడు బంగారం, వెండి ధరలు సామాన్యులకు చిక్కనండూ పరుగులు పెడుతూనే ఉన్నాయి.