హోళీ పండగ వేళ బంగారం ధరలు షాకిచ్చాయి. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాల కోసం పుత్తడి కొనాలని అనుకునేవారికి సడెన్ షాక్ తగిలింది. గత కొద్ది రోజులుగా పరుగులు పెడుతూ వస్తున్న పసిడి ధరలకు ..హోళీ వేళ మళ్లీ రెక్కలు వచ్చాయి. ఈరోజు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు మరింత పుంజుకోవడంతో గోల్డ్ కొనాలకునేవారికి మరోసారి దడ పుడుతోంది.
ఇటీవల ఒకరోజు తగ్గుతూ.. ఒకరోజు పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు.. హోళీ పండగ రోజు తన దూకుడును పెంచాయి. దేశీయ మార్కెట్లో పసిడి ధరలు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగారం ధరలకు రెక్కలు రావడం సామాన్యులకు షాక్ కొట్టింది. ఇక ఇప్పటికే వెండి ఎప్పుడో లక్ష రూపాయలకు చేరుకోగా.. ఈరోజు ఉదయం హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధరలు మొదటిసారిగా 90 వేల రూపాయల మార్క్‌కు చేరి గోల్డ్ లవర్స్‌ను కంగుతినేలా చేసింది.
ఈరోజు ఉదయం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 88,590 రూపాయలకు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర 81,210 రూసాయలుగా ఉంది. హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర 88,590 రూపాయలు ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర 81,210 రూపాయలకు చేరింది. అలాగే విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.