ముగిసిన ట్రంప్ భారత పర్యటన, అమెరికాకు తిరుగుపయనం

America President Donald Trump, Donald Trump, Donald Trump Concludes India Visit, Donald Trump India Visit, Donald Trump Live News, first lady melania trump, Mango News Telugu, PM Modi, US President Donald Trump
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల భారత పర్యటన ముగిసింది. ఫిబ్రవరి 25, మంగళవారం రాత్రి భారత పర్యటనను ముగుంచుకుని ఆయన అమెరికాకు తిరుగుపయనమయ్యారు. అంతకు ముందు రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇచ్చిన ప్రత్యేక విందు కార్యక్రమానికి ట్రంప్‌ దంపతులు హాజరయ్యారు. ట్రంప్‌ దంపతులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు సాదర స్వాగతం పలికారు. ఈసందర్భంగా రాష్ట్రపతి భవన్ విశేషాలు, చారిత్రక నేపధ్యాన్ని ట్రంప్ దంపతులకు కోవింద్ వివరించారు. అక్కడ ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో ట్రంప్‌ దంపతులు కొద్దీసేపు మాట్లాడారు. విందుకు అతిథులుగా వచ్చిన పలువురు కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులను రాష్ట్రపతి ట్రంప్‌కు పరిచయం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు అతిథులతో ట్రంప్‌ దంపతులు కరచాలనం చేశారు. రాష్ట్రపతి భవన్ లో విందు కార్యక్రమం ముగిసిన అనంతరం నేరుగా విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి అమెరికాకు బయలుదేరి వెళ్లారు.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =