దేశంలోని ఐటీ మరియు ఐటీ ఆధారిత సేవల (ITES) రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించాయి పలు ఐటీ కంపెనీలు. ఐటీ కంపెనీల ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (Work From Home – WFH) సదుపాయాన్ని కలిగిస్తున్నాయి.
మరింత కాలం ఇంటి నుంచే పని.. గతంలో కోవిడ్ సమయంలో ప్రారంభమైన ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి, ప్రస్తుతం హైబ్రిడ్ మోడల్లో కొనసాగుతోంది. ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుండి పని చేసే అవకాశాన్ని కల్పించడం ద్వారా ఉద్యోగులకు వెసులుబాటు కలగడమే కాకుండా, కంపెనీల నిర్వహణ వ్యయం కూడా తగ్గనుంది.
ముఖ్యమైన నిబంధనలు ఇవే:
-
100% ఉద్యోగులకు అవకాశం: సెజ్ యూనిట్లలో పనిచేసే మొత్తం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అధికారాన్ని ఆయా సంస్థలకే కల్పించారు.
-
వసతుల కల్పన: ఇంటి నుండి పనిచేసే ఉద్యోగులకు అవసరమైన ల్యాప్టాప్లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ మరియు ఇతర సాంకేతిక పరికరాలను సంస్థలే సమకూర్చాల్సి ఉంటుంది.
-
డిజిటల్ మౌలిక సదుపాయాలు: సురక్షితమైన నెట్వర్క్ ద్వారా కార్యాలయ పనులను నిర్వహించేలా ఐటీ కంపెనీలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఉద్యోగుల్లో హర్షం: మెట్రో నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు, అద్దెలు మరియు ఇతర ఖర్చుల దృష్ట్యా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ఐటీ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు, సొంత ఊర్ల నుండి పనిచేయాలనుకునే వారికి ఇది పెద్ద ఊరట అని చెప్పవచ్చు. ఐటీ రంగంలో ప్రతిభను కాపాడుకోవడానికి (Employee Retention) కూడా ఈ నిర్ణయం దోహదపడనుంది.



































