మరో సీఎంకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ

Chief Minister of Haryana, Haryana Chief Minister ML Khattar Tests Positive, Haryana CM, Haryana CM Khattar, Haryana CM Manohar Lal Khattar, haryana coronavirus cases, haryana coronavirus cases today, haryana coronavirus news, Manohar Lal Khattar, Manohar Lal Khattar Admitted To Medanta

దేశంలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతుంది. దీంతో దేశవ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హర్యానా ‌ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ” కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోగా ఫలితం పాజిటివ్ గా వచ్చింది. గత వారంలో నన్ను కలిసిన ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే నాతో సన్నిహితంగా ఉన్నవారంతా వెంటనే క్వారంటైన్ లోకి వెళ్లాలని అభ్యర్థిస్తున్నాను” అని సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్ ట్వీట్ చేశారు. దేశంలో ఇప్పటికే మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, కర్ణాటక సీఎం యడియూరప్ప కరోనా వైరస్ బారినపడి, చికిత్స అనంతరం కోలుకున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu