హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నేడు ఒకే విడతలో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. శనివారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 5:30 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5.30 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి సమయం దాటినా కూడా ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇక ఈ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 65.92 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఉదయం కొంత మందకొడిగా సాగిన పోలింగ్, క్రమంగా వేగం పుంజుకుని మధ్యాహ్నం 1 గంట వరకు 37.19 శాతం పోలింగ్ నమోదైంది. కొన్ని కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతుండడంతో పూర్తి ఓటింగ్ శాతం ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే 72-74 శాతం పోలింగ్ నమోదు కానున్నట్టు తెలుస్తుంది. హిమాచల్ ప్రదేశ్ లో అన్ని చోట్ల ఎన్నికలు ప్రశాంతంగా ముగియగా, తాషిగ్యాంగ్‌లో 100 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్ లో ముఖ్యంగా అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్యనే కీలక పోటీ నెలకుంది. ఈ మూడు పార్టీలు మొత్తం 68 స్థానాల్లో పోటీ చేశాయి. రాష్ట్రంలో మళ్లీ అధికారం దక్కించుకోవడంపై బీజేపీ, ఈసారి అధికారం తమదే అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 68 స్థానాలకు గానూ అన్ని పార్టీల నుంచి 412 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే బరిలో నిలిచిన వారి భవితవ్యం తేలాలంటే మరో 28 రోజులు ఆగాల్సి ఉంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపును, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుతో పాటుగా డిసెంబర్ 8వ తేదీన నిర్వహించి, ఫలితాలను వెల్లడించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE