భారత తపాలా శాఖలో భారీ ఉద్యోగావకాశం!భారత తపాలా శాఖ (India Post) 21,413 గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 1,215, తెలంగాణలో 519 ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులు మార్చి 3, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ GDS నోటిఫికేషన్ ద్వారా బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM), గ్రామీణ డాక్ సేవక్స్ (GDS) పోస్టుల భర్తీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ప్రకటన ద్వారా వివిధ పోస్టల్ సర్కిళ్లలో మొత్తం 21,413 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 1215 పోస్టులు ఉండగా.. తెలంగాణలో 519 పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఖాళీల వివరాలు, అప్లికేషన్ లింక్ చెక్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ చూడొచ్చు.
ఖాళీలు & వయోపరిమితి
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM)
అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)
డాక్ సేవక్ (Dak Sevak)
వయస్సు: 18 – 40 సంవత్సరాలు (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపులు ఉంటాయి).
జీతభత్యాలు
BPM: ₹12,000 – ₹29,380
ABPM/Dak Sevak: ₹10,000 – ₹24,470
ఎంపిక విధానం
మెరిట్ ఆధారంగా ఎంపిక – పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
సైకిల్ లేదా స్కూటర్ నడపడం తప్పనిసరి.
దరఖాస్తు వివరాలు
అధికారిక వెబ్‌సైట్: indiapostgdsonline.cept.gov.in
దరఖాస్తు ప్రారంభం: ఫిబ్రవరి 10, 2025
దరఖాస్తు చివరి తేదీ: మార్చి 3, 2025
దరఖాస్తు సవరణ తేదీలు: మార్చి 6 – 8, 2025
దరఖాస్తు ఫీజు
జనరల్/OBC/EWS: ₹100
SC/ST/దివ్యాంగులు/మహిళలు/ట్రాన్స్ ఉమెన్: ఫీజు లేదు