మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ముంబయి ఆర్ధిక పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబయిలోని అంధేరీలో జరిగిన ఓ ఓ సభలో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ మాట్లాడుతూ, గుజరాతీ మరియు రాజస్థానీ ప్రజలను మహారాష్ట్ర నుండి, ముఖ్యంగా ముంబయి, థానేల నుండి తొలగిస్తే, ఇక్కడ డబ్బు మిగిలి ఉండదు. మీరు ముంబయిని ఆర్థిక రాజధాని అని పిలుస్తారు, కానీ గుజరాతీ మరియు రాజస్థానీ ప్రజలు ఇక్కడ లేకుంటే, ముంబయిని ఆర్థిక రాజధాని అని పిలవరు, అలా కొనసాగదు” అని వ్యాఖ్యానించారు. గవర్నర్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలతో మహారాష్ట్రలో వివాదం రేగింది. గవర్నర్ వ్యాఖ్యలను శివసేన ఎంపీ సంజయ్ రౌత్, మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే సహా పలువురు నేతలు ఖండించారు.
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ట్వీట్ చేస్తూ బీజేపీ ప్రాయోజిత ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన వెంటనే, మరాఠీ వ్యక్తి అవమానానికి గురవుతున్నాడని అన్నారు ..ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే గవర్నర్ వ్యాఖ్యలను ఖండించాలని, ఆయన వ్యాఖ్యలు మరాఠీ కష్టజీవులను అవమానించడమే అని అన్నారు. ఇక మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ఆయన్ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే డిమాండ్ చేశారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఈ మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించి గవర్నర్ వ్యాఖ్యలను ఖండించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY







































