ఐటీ రిటర్న్స్ దాఖలుకు రేపే చివరి తేదీ, గడువును పొడిగించడం కుదరదు – ఆదాయపు పన్ను శాఖ

India Tomorrow is The Deadline For Filing Income Tax Returns No Chance To Date Extension, Tomorrow is The Deadline For Filing Income Tax Returns No Chance To Date Extension, No Chance To Date Extension, Tomorrow is The Deadline For Filing Income Tax Returns, Income Tax Returns, Income Tax Return Deadline Tomorrow, ITR Filing AY 2022-23, Income tax return deadline, deadline to file an Income Tax return is July 31, No plan to extend deadline for ITR, Income Tax Return Filling Deadline News, Income Tax Return Filling Deadline Latest News, Income Tax Return Filling Deadline Latest Updates, Income Tax Return Filling Deadline Live Updates, Mango News, Mango News Telugu,

2021-22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేయటానికి గడువు ఆదివారం (జూలై 31) తో ముగియనుంది. ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేయటానికి ప్రభుత్వం మరోసారి గడువు పెంచనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అలాగే మరోవైపు సోషల్ మీడియాలో గడువును పొడిగించాలని పలువురు పౌరులు సోషల్ మీడియాలో ఆదాయపు పన్ను శాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై ఐటీ శాఖ అధికారులు స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని, గడువు పొడిగించడం కుదరదని వారు స్పష్టం చేశారు. ఇంతవరకు ఐటీ రిటర్న్ దాఖలు చేయనివారు రేపటి లోగా ఫైల్ చేయాలన్నారు.

ఇక జరిమానా నుండి తప్పించుకోవడానికి గడువుకు ముందే రిటర్న్‌లను దాఖలు చేయాలని ఐటీ శాఖ పన్ను చెల్లింపుదారులను కోరింది. మీరు ఇప్పటికే రిటర్న్‌ని ఫైల్ చేసి ఉంటే లేదా గడువు తేదీకి ముందే ఫైల్ చేయగలిగితే మంచిదని సూచించారు. ఒకవేళ గడువు తేదీ లోపు చెల్లించలేకపోతే పెద్ద మొత్తంలో పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఐటీ శాఖ తెలిపిన దాని ప్రకారం.. వార్షిక ఆదాయం రూ. 5 లక్షల వరకు ఉన్న పన్ను చెల్లింపుదారులకు ఆలస్య రుసుము రూ.1,000 కాగా, వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఆలస్య జరిమానా రూ.5,000గా ఉండనుంది. అయితే, మీ స్థూల మొత్తం ఆదాయం ప్రాథమిక పన్ను మినహాయింపు (రూ. 2.5 లక్షలు) పరిమితిని మించకపోతే, ఆలస్యంగా దాఖలు చేసినందుకు మీరు జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 15 =