భారత్ సంతకం పెట్టకపోవడానికి కారణం?

India Backs Away From Supporting Ukraine,India Refuses To Endorse Ukraine ,Indian Debates On The War In Ukraine,India Stays Away From Ukraine,India Backs Away,India, India Not Signing, India-Ukraine, Summit In Switzerland, Supporting Ukraine,Live Updates, Political Updates, Political News,Mango News, Mango News Telugu
India-Ukraine,India ,supporting Ukraine,India not signing, India , summit in Switzerland

స్విట్జర్లాండ్‌లో  తాజాగా జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ఇండియా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఉక్రెయిన్‌లో శాంతి కోసం చేయాల్సిన ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయడానికి భారతదేశం వెనుకడుగు వేసింది. ఎందుకంటే రష్యా..ఈ  శిఖరాగ్ర సమావేశానికి  హాజరు కాకూడదని నిర్ణయం తీసుకుంది. రష్యా, ఉక్రెయిన్‌కు సంబంధించిన చర్చలో రష్యా లేకపోతే ిక శాంతికి ముందడుగు పడే అవకాశం లేదని.. దీని వల్ల సమయం వృధా అవుతుందని భారత దేశం భావించింది.దీంతోనే ఉక్రెయిన్ లో శాంతికోసం చేయాల్సిన సంతకం చేయడానిక ఇండియా ముందుకు రాలేదు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో పాటు 50 మందికి పైగా దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలంతా కలిసి.. ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పడానికి.. దీనికోసం ఒక మార్గాన్ని రూపొందించడానికి స్విట్జర్లాండ్‌లో రెండు రోజుల పాటు సదస్సును ఏర్పాటు చేశారు. స్విస్ ఆల్పైన్ రిసార్ట్ ఆఫ్ స్టాన్స్‌స్టాడ్‌లో ఈ శాంతి చర్చలు రెండు రోజుల పాటు జరిగాయి. రెండు రోజులలో  ఒక్కరోజు కూడా  రష్యా ఈ సమావేశానికి హాజరుకాలేదు.

భారతదేశం తరపున ఈ సమావేశానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పవన్ కపూర్ ప్రాతినిధ్యం వహించారు.  ఉక్రెయిన్‌లో చర్చల ద్వారా పరిష్కారానికి మార్గాలను వెతకడమే భారత్ ఉద్దేశమని కపూర్ తెలిపారు.కానీ దీని కోసం అన్ని పక్షాలు చర్చల్లో భాగం కావాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేసారు. భారతదేశం విధానం స్థిరంగా ఉందని.. సమాధానం  కానీ దౌత్యం ద్వారా కానీ మాత్రం శాశ్వత శాంతికి మార్గం చూపించొచ్చని పవన్ కుమార్ వివరించారు. రష్యా,ఉక్రెయిన్ దేశాల మధ్య  ఆచరణాత్మక పరిష్కారాన్ని చూపించాలని భారత్ అభిప్రాయపడింది.

స్విట్జర్లాండ్‌లో ఈ సమ్మిట్‌లో దేశాధినేతలతో పాటు 100కి పైగా దేశాలు, వివిధ సంస్థల నుంచి ప్రతినిధులు  సమావేశమయ్యారు. ఈ సమావేశాలకు చైనా కూడా హాజరు కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ సమ్మిట్ లో కొన్ని దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా తమ సంతకాలు చేయగా.. భారతదేశంతో పాటు ఇండోనేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా దేశాలు శాంతి పత్రంలో సంతకాలు చేయడానికి ఇష్టపడలేదు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE