ప్రధాని నరేంద్ర మోదీతో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీ

West Bengal CM Mamata Banerjee Meets PM Narendra Modi in Delhi, CM Mamata Banerjee Meets PM Narendra Modi in Delhi, Mamata Banerjee Meets PM Narendra Modi in Delhi, West Bengal CM Meets PM Narendra Modi in Delhi, PM Narendra Modi, West Bengal CM Mamata Banerjee, CM Mamata Banerjee, West Bengal CM, Mamata Banerjee, CM Mamata Banerjee Delhi Tour, CM Mamata Banerjee Delhi Visit, CM Mamata Banerjee Delhi Tour News, CM Mamata Banerjee Delhi Tour Latest News, CM Mamata Banerjee Delhi Tour Latest Updates, CM Mamata Banerjee Delhi Tour Live Updates, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం మమతా బెనర్జీ భేటీ అయ్యారు. 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని అధికార నివాసంలో ప్రధాని మోదీని కలిశారు. దాదాపు గంటపాటు ఇరువురు నేతల మధ్య సమావేశం జరిగినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలతో పాటుగా జీఎస్టీ బకాయిలపై ప్రధానితో చర్చించినట్టు సమాచారం.

శనివారం ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీతో సీఎం మమతా బెనర్జీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని టీఎంసీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు శుక్రవారం రాత్రి సీఎం మమతా బెనర్జీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కూడా కలవనున్నారు. అదేవిధంగా ప్రధాని మోదీ అధ్యక్షతన ఆగస్టు 7న జరిగే నీతి ఆయోగ్ ఏడవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి కూడా సీఎం మమతా బెనర్జీ హాజరయ్యే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here