దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 72 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే 63,509 పాజిటివ్ కేసులు నమోదవగా, 730 మంది మరణించారు. దీంతో అక్టోబర్ 14, బుధవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 72,39,389 కు, మరణాల సంఖ్య 1,10,586 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు ఒకే రోజులో 74,632 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ఈ రోజు వరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 63,01,927 కు చేరుకుంది.
దేశంలో గతకొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. అలాగే కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ప్రసుతం కరోనా రికవరీ రేటు 87.05 శాతం గానూ, మరణాల రేటు 1.53 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 8,26,876 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశాల్లో రెండో స్థానంలో, కరోనా మరణాలు ఎక్కువగా నమోదైన దేశాల్లో మూడో స్థానంలో భారత్ కొనసాగుతుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu