దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.12 శాతంగా నమోదవగా, వరుసగా 32 రోజులుగా 3% కన్నా తక్కువ ఉంటుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 35,342 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,12,93,062 కు చేరుకుంది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 483 మంది మరణించడంతో మరణాల సంఖ్య 4,19,470 కి పెరిగింది. ప్రస్తుతం 4,05,513 (1.30%) మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్ లలో, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కొత్తగా కేరళ (12,818), మహారాష్ట్ర (7,302), ఒడిశా (1,948), తమిళనాడు (1,872), ఆంధ్రప్రదేశ్ (1,843), అస్సాం (1,796), కర్ణాటక (1,653), మణిపూర్ (928), వెస్ట్ బెంగాల్ (793), తెలంగాణ (648) వంటి 10 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. ఇక దేశంలో మరో 38,740 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 3,04,68,079 (97.36%) కు చేరుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ