తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 2055 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఏప్రిల్ 7, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,704 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 303 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 3,03,601 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 95.26 శాతంగా ఉంది.
ఇక కరోనా వలన రాష్ట్రంలో మరో ఏడుగురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1741 కి పెరిగింది. కాగా మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,362 యాక్టీవ్ కేసులు ఉండగా, ఇందులో 8,263 మంది హోం/ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 398, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలో 214, రంగారెడ్డి జిల్లాలో 174, నిజామాబాదులో 169, నిర్మల్ లో 100, జగిత్యాలలో 99, కరీంనగర్ లో 77, వరంగల్ అర్బన్ లో 74, సంగారెడ్డిలో 65 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ