ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య కీలకమైన మూడో టెస్టు ఈ రోజు మొదలుకానుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు మ్యాచ్ తోపాటు సిరీస్ ను కూడా గెలుచుకునే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికాలో గత ఏడు పర్యటనల్లో ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేకపోయిన టీమిండియా ఈ సారి సిరీస్ విజయమే లక్ష్యంగా అక్కడ అడుగుపెట్టింది. సెంచూరియన్ లో గెలిచి ముందడుగు వేసింది. అయితే, జొహన్నెస్‌బర్గ్‌లో ఆతిథ్య జట్టు పోరాటంతో మ్యాచ్ చేజార్చుకుంది. దీంతో లెక్క సమమైంది. ఇప్పుడు మూడవ టెస్టు రూపంలో మరో అవకాశం ఇండియా ముంగిట నిలిచింది. మరి, మనవాళ్ళు ఈ మ్యాచ్ గెలిచి రికార్డు సృష్టిస్తారో లేదో తెలియాలంటే మరో 4 రోజులు వేచి చూడాల్సిందే.
గత మ్యాచ్‌లో ఓడినా ఇప్పటికీ ప్రత్యర్థితో పోలిస్తే టీమిండియా పటిష్టంగా కనిపిస్తోంది. అయితే, సొంత మైదానంలో సిరీస్ చేజార్చుకోరాదనే పట్టుదల, గత మ్యాచ్ విజయం ఇచ్చిన స్ఫూర్తి దక్షిణాఫ్రికా టీమ్‌లో కూడా ఉత్సాహం పెంచాయి. న్యూలాండ్స్ మైదానంలో భారత్ గతంలో ఎన్నడూ గెలవకపోయినా…కొత్త చరిత్ర సృష్టించడం ఈ జట్టుకు కొత్త కాదు. ఇది టెస్టు పిచ్ అని విశ్లేషకుల అంచనా. ఆరంభంలో పేసర్లు ప్రభావం చూపించడంతో పాటు బౌన్స్ కారణంగా బ్యాట్స్‌మెన్ కూడా బాగా పరుగులు సాధించే అవకాశం ఉంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ.. పొడిబారి స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. న్యూలాండ్స్ మైదానంలో టీమిండియా రికార్డు ఇలా ఉంది.. 5 టెస్టులు ఆడిన భారత్, 3 మ్యాచ్‌లలో ఓడి 2 ‘డ్రా’గా ముగించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ