కాబూల్‌ కంచె దాటిన పసిబిడ్డ – ఎట్టకేలకు కుటుంబం చెంతకు

Afghan Baby Lost In Kabul Airlift Chaos Finally Found And Reunited With His Family, baby lost in US airlift, Kabul Airlift, Kabul Airlift Chaos, Afghan Baby Lost In Kabul Airlift, Reunited, Afghan Baby lost in Afghanistan airlift, A baby lost In Kabul Airlift, Sohail Ahmadi, chaos of the American evacuation, Reunited With His Family, Mango News, Mango News Telugu,

గత సంవత్సరం ఆగస్టు నెలలో.. అన్ని దినపత్రికలలో పతాక శీర్షికన ప్రచురితమైన ఒక ఫోటో ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఓ పసికందును తండ్రి విమానాశ్రయం దగ్గర ఫెన్సింగ్‌ దాటించిన ఫొటో.. మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న సమయంలో తీసిన ఫోటో అది. అప్పుడు కనిపించిన పలు హృదయవిదారక దృశ్యాలు ప్రపంచాన్ని కదిలించాయి. తాలిబన్ల భయంతో.. సాధారణ ప్రజలు అఫ్ఘన్‌ నుంచి పారిపోవడానికి విమానాల రెక్కలు, టైర్ల మధ్య కూర్చోవటం చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఆ ప్రయాణంలో కొందరు పౌరులు గగనతలం నుంచి కిందపడి ప్రాణాలు పోగొట్టుకోవడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాలిబన్ల నుంచి కనీసం తమ పిల్లలను, ఆడకూతుళ్లను రక్షించుకోవాలని ఉద్దేశంతో తల్లిదండ్రులు పడ్డ కష్టాల వంటి ఘటనలు కలిచివేశాయి.

ఈ పరిస్థితుల్లో కాబుల్‌లో చోటుచేసుకున్న గందరగోళ పరిస్థితుల్లో.. మీర్జా అలీ అహ్మదీ అనే అతను యూఎస్‌ ఎంబసీ సెక్యూరిటీ గార్డు. తన భార్య సురయాతోపాటు, నలుగురు పిల్లలు వెంటబెట్టుకొని అమెరికా తరలిపోవాలనుకున్నాడు. అయితే, అప్పటికే అక్కడ కొన్ని వందలమంది గుమికూడి ఉన్నారు. ఈ క్రమంలో.. ముందుగా బిడ్డను ఎయిర్‌పోర్ట్‌ లోపలకి చేర్చటానికి అక్కడున్న సైనికులకు అందించి ఫెన్సింగ్‌ దాటించాడు ఆ తండ్రి. ఆ చిన్నారి పేరు సోహైల్ అహ్మదీ. ఆ తర్వాత బాబు కనిపించకుండా పోయాడు. అయితే ఆ సైనికుడు బాబును తిరిగి తమవద్దకు చేరుస్తారని భావించిన తల్లిదండ్రులకు నిరాశ ఎదురైంది. ఆ నెలల చిన్నారి కనిపించకుండా పోయాడు. దీంతో ఆ తల్లిదండ్రుల గుండెలు బద్ధలు అయ్యాయి. కాబూల్‌లోనే ఉండిపోయి నాలుగు నెలలపాటు నిద్రాహారాలు మానేసి బిడ్డ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. బిడ్డపై ఆశలు పోతున్న క్రమంలో చివరికి పునరావాసం కింద అమెరికాకు వెళ్లింది ఆ కుటుంబం.

అయితే ఎయిర్‌పోర్ట్‌లో ఏడుస్తూ కనిపించిన ఆ పసికందును.. హమీద్ సఫీ అనే ఒక ట్యాక్సీ డ్రైవర్‌ గుర్తించాడు. గందరగోళ పరిస్థితుల్లో బాబును ఎవరికి ఇవ్వలో అతనికి అర్థం కాలేదు. పైగా పిల్లలు లేకపోవడంతో ఆ బిడ్డను అల్లా ఇచ్చిన బిడ్డగా భావించి పెంచుకోవాలని ఇంటికి తీసుకెళ్లాడు సఫీ. ఈ నేపథ్యంలో.. బిడ్డను వెతికే క్రమంలో ఆ చిన్నారి తాత మొహమ్మద్ ఖాసేమ్ రజావికి.. రెడ్‌క్రాస్‌ సాయంతో ఆ చిన్నారి టాక్సీ డ్రైవర్‌ సఫీ వద్ద బాబు ఉన్నట్లు తెలిసింది. దీంతో ఖాసేమ్ రజావి.. సఫీ వద్దకు పంపి బాబును తిరిగి ఇవ్వాలని కోరాడు. అయితే సఫీ ముందు ససేమీరా అన్నాడు. పోలీసులు కిడ్నాప్‌ కేసు పెడతామని హెచ్చరించారు. అయినా సఫీ బెదరలేదు. చివరికి కన్నప్రేమకు, ఆ తల్లిదండ్రుల కన్నీళ్లకు కరిగిపోయాడు. కన్నీటి పర్యంతమవుతూనే.. బాబు సోహైల్‌ను తాత రజావి చేతికి అందించాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =