దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ డోసులను అందిస్తున్న విషయం తెలిసిందే. జూన్ 21 నుంచి ప్రారంభమైన కోవిడ్ వ్యాక్సినేషన్ కొత్తవిధానంలో భాగంగా దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్ డోసుల్లో 75 శాతం కేంద్ర ప్రభుత్వమే సమీకరించించి, వాటిని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో 66 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసుల కోసం కేంద్రప్రభుత్వం ఆర్డర్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇందులో 37.5 కోట్ల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ (సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా), 28.5 కోట్ల డోసుల కొవాగ్జిన్ వ్యాక్సిన్ (భారత్ బయోటెక్) ఉన్నట్టు సమాచారం.
ఇప్పటివరకు వ్యాక్సిన్ల కోసం కేంద్రం పెట్టిన ఆర్డర్లలో ఇదే అతిపెద్దది కానుంది. ఇందుకోసం 14,505 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం చెల్లించనుంది. ఈ 66 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు ఆగస్టు-డిసెంబర్ మధ్య అందుబాటులోకి వచ్చే అవకాశముంది. మరోవైపు నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యుడు డాక్టర్ వికె పాల్ మాట్లాడుతూ, జూలై ముగిసే లోపు దేశవ్యాప్తంగా 50 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీకి లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్తున్నట్టు తెలిపారు. కేంద్రం ఆర్డర్ ఇచ్చిన 66 కోట్ల కోవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ డోసులే కాకుండా, అదనంగా ప్రైవేటు ఆసుపత్రులకు మరో 22 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ